ఈ మధ్యకాలంలో కొందరు యువకులు పోలీసులమని చెబుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరాల్లోని రోడ్లపై తిరుగుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్రలోని కొందరు యువకులు పోలీసులమంటూ రెచ్చిపోయారు. సరదాగ బయటకు వెళ్లిన ఓ ప్రేమజంటను ఆ ఫేక్ పోలీసులు బెదిరించారు. ఇంతటితో ఆగకుండా ప్రియుడి ముందే ప్రియురాలిపై దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
మహారాష్ట్ర థానె జిల్లా డోంబివిలి నగరంలో ఓ యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. వీరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇకపోతే ఈ ప్రేమ జంట ఇటీవల సరదాగా బయటకు వెళ్లారు. ఓ చోట కూర్చుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో అటు నుంచి ఇద్దరు యువకులతో ప్రయాణిస్తున్న ఓ కారు వచ్చి ఆ ప్రేమజంట ముందు ఆగింది. వాళ్లిద్దరూ వెంటనే కారులో నుంచి బయటకు దిగి.. మేము పోలీసులం, మీరు ఇక్కడేం చేస్తున్నారని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఫేక్ పోలీసులు ఇద్దరినీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆ యువతిపై ఒకరి తర్వాత ఒకరు ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఇంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని తమ సెల్ ఫోన్ లో వీడియోలు కూడా తీసుకున్నారు. అనంతరం ఆ దుండగులు వారిని వదిలేసి అక్కడి నుంచి కారులో పారిపోయారు. ఆ తర్వాత ఆ ప్రేమజంట జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.