దంపతుల మధ్య గొడవలు జరగడం అనేది సంసారంలో సర్వసాధారణం. కానీ అదే కోపంలో తట్టుకోలేని ఓ భర్త ఎవరూ కూడా ఊహించని రీతిలో నిర్ణయం తీసుకుని దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా భార్యపై సామూహిక అత్యాచారం చేయించాడీ కసాయి భర్త. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నీలంగా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళకు గతంలో వివాహం జరిగింది.
వీళ్లు పని చేసే వ్యవసాయ క్షేత్రంలోనే నివాసం ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆ మహిళ కోపంతో పుట్టింటికి వెళ్లింది. కాగా పుట్టింటివాళ్లు కూతురుని తీసుకుని భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక బాగుంటారులే అనుకుంటున్న సమయంలోనే మరోసారి గొడవలు జరిగాయి.
ఇది కూడా చదవండి: భర్త ఆత్మహత్య.. ఆరుగురు పిల్లల్ని వదిలి ప్రియుడితో మహిళ పరార్!
తట్టుకోలేకపోయిన భర్త కోపంతో ఏకంగా తను పనిచేస్తున్న యజమానితో పాటు అతని సోదరుడితో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేయించాడు. ఈ మేరకు బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.