దేశ వ్యాప్తంగా ప్రతి రోజు కొన్ని వేల సంఖ్యలో నేరాలు-ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో రేప్‌లు, ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువగా ఉంటుంన్నాయి. వీటిలో కూడా కొన్ని అనుమానాస్పద మృతి కేసులు కూడా ఉంటున్నాయి. చనిపోయిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక వారిని ఎవరైనా హత్య చేశారా? అన్న విషయం తెలియకపోతే పోలీసులు వాటిపై అనుమానాస్పద కేసు నమోదు చేస్తారు. తర్వాత రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తారు. దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటపడుతుంటాయి. తాజాగా, రాజస్తాన్‌లోని ఓ ప్రాంతంలో దారుణం వెలుగుచూసింది. గుడిలోని గంటకు ఓ యువకుడి శవం వేలాడుతూ కనిపించింది. అయితే, అది హత్యా? లేక ఆత్మహత్యా అన్నది తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శ్రవణ్ దాస్‌కు దైవ భక్తి ఎక్కువ.
గత ఎనిమిది ఏళ్లుగా రాజస్తాన్, నాగోలా గ్రామంలోని యోగేశ్వర్ ధామ టెంపుల్‌లో ఉంటున్నాడు. మహంత్ లక్ష్మణ్ దాస్ శిష్యుడిగా అక్కడే ఉంటున్నాడు. గురువారం ఉదయం 8 గంటల నేపథ్యంలో భోజనం వండి మహంత్ దాస్‌కు ఒడ్డించాడు. తర్వాత శంకర్ గ్రామంలోని తన స్నేహితులను కలవటానికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటల నేపథ్యంలో యోగేశ్వర్ ధామ్ గుడిలోని గంటకు ఉరితాడుతో వేలాడుతూ కనిపించాడు. అయితే, అతడి మోకాళ్లు నేలకు ఆనుకునే ఉన్నాయి. దీంతో అక్కడి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రవణ్ దాస్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.