దేశంలో కొందరు మగాళ్లు మృగాలుగా మారి దారుణాలకు కాలు దువ్వుతున్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముసలవ్వల వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాగే బరితెగించిన ఓ మానవ మృగం నర్సరీ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్య ప్రదేశ్ భోపాల్ ని ఓ ప్రైవేట్ స్కూల్ లో మూడున్నరేళ్ల ఓ చిన్నారి నర్సరీ చదువుతోంది. రోజూ స్కూల్ కు బస్సులో వెళ్తూ వస్తూ ఉండడంతో ఆ స్కూల్ బస్సు డ్రైవర్ ఆ నర్సరీ చిన్నారిపై కన్నేశాడు.
ఇక సమయం దొరికితే కాటేదాం అనే విషపు ఆలోచన వచ్చింది. అయితే ఈ గురువారం ఆ చిన్నారి స్కూల్ అయిపోగానే ఎప్పటిలాగే బస్సులో వచ్చి కూర్చుంది. ఈ రోజు ఎలాగైన ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడాలని డ్రైవర్ తనలో తాను అనుకున్నాడు. అయితే ఆ చిన్నారిది చివరి స్టాప్ కావడంతో ఆ డ్రైవర్ దీనిని తనకు మరింత అవకాశంగా మలుచుకున్నాడు. ఇక బస్సులోని పిల్లలు అందరూ దిగిపోయారు. చివరగా మిగిలింది ఆ చిన్నారి మాత్రమే. దీంతో ఆ దుర్మార్గుడు ఆ బస్సులో ఉన్న మరో మహిళ సాయంతో ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు.
అనంతరం ఆ చిన్నారి బట్టలు విప్పి బ్యాగులో ఉన్న మరో డ్రెస్ తొడిగాడు. ఆ తర్వాత ఆ బాలికను ఎప్పటిలాగే ఏం తెలియనట్లుగా ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లారు. ఆ చిన్నారి ఇంటికి రాగనే ప్రైవేట్ పార్ట్ లో నొప్పిగా ఉన్నట్లు తల్లికి వచ్చి రాని మాటల్లో చెప్పింది. పైగా బట్టలు కూడా మార్చి ఉండడంతో తల్లికి కాస్త అనుమానం కలిగింది. వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి.. మా పాపకు బట్టలు మార్చారా? అని అడిగింది. వెంటనే స్పందించిన ప్రిన్సిపల్.. మేము ఏం మార్చలేదు అని తెలిపింది.
దీంతో తల్లి తన కూతురిని అడగగా.. స్కూల్ బస్సులో డ్రైవర్ అంకుల్ విప్పాడని, ఇదే కాకుండా అతను చేసిన దారుణాన్ని కూడా ఆ చిన్నారి తల్లికి వివరించింది. ఒక్కసారిగా ఒంటికాలుపై లేచిన ఆ చిన్నారి తల్లి బస్సు డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ డ్రైవర్ తో పాటు బస్సులో డ్రైవర్ కు సహకరించిన మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై ఆ రాష్ట్ర హోంమంత్రి సైతం స్పందించి చర్యలకు సిద్దమయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మూడేళ్ల నర్సరీ చిన్నారిపై బస్సు డ్రైవర్ చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.