ఒడిస్సా లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త కిరాతకానికి పాల్పడి భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీనే అమ్ముకున్నాడు. అసలు విషయం బయటపడడంతో భార్య తల పట్టుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఒడిస్సాలోని కోటమెట గ్రామంలో ప్రశాంత్ కందూ, రంజిత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2012లో వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో భర్తకు అస్సలు తోచలేదు.
ఈ క్రమంలోనే భర్త ప్రశాంత్ కు ఓ దుర్మార్గమైన ఆలోచన వెలిగింది. అదే కిడ్నీని అమ్మడం. ఎవరిదో కాదు.. తన భార్యదే. ఎలాగైన సరే ఆమెకు తెలియకుండా భార్య కిడ్నీని అమ్మాలని ప్లాన్ వేశాడు. అయితే ఇతని ప్లాన్ లో భాగంగానే ముందుగానే స్థానిక ఆస్పత్రిలోని ఓ వైద్యుడితో డీల్ కుదుర్చుకున్నాడు. అయితే 2018లో.. నీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు ఆస్పత్రి తీసుకెళ్తున్నానని భర్త భార్యను నమ్మించాడు. ఇది నిజమేనేమో అని భార్య భర్తపై ప్రేమను ఒలకబోసింది. ఇక ఆస్పత్రికి చేరుకున్నాక ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెకు తెలియకుండానే ఓ కిడ్నీని తీసేశారు. అనంతరం కొన్ని రోజులు మత్తులో ఉండడంతో ఆమెకు అస్సలు ఏం అర్థం కాలేదు.
అలా కొన్నాళ్ల పాటు రంజిత బాగానే ఉన్నట్లు అనుకుంది. కాగా కిడ్నీని అమ్మగా వచ్చిన డబ్బులతో భర్త ప్రశాంత్ తెగ ఎంజాయ్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల రంజితకు కడుపులో ఏదో నొప్పిగా ఉండడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించింది. పరీక్షించిన వైద్యుడు నీకు కిడ్నీ ఒకటే మాత్రమే ఉందనే నిజాన్ని బయటపెట్టాడు. డాక్టర్ చెప్పింది విని రంజితకు గుండె పగిలినంత పనైంది. అయితే ఇదే విషయమై భార్య.. భర్త చేసిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే కాకుండా నా భర్త 8 నెలల కిందట ఏపీకి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకుని బెంగుళూరు వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#Odisha: Woman accuses husband of selling her kidney in 2018 https://t.co/lW7paQNL8d pic.twitter.com/CLkQapvUue
— The Times Of India (@timesofindia) August 26, 2022