తన భార్య తనను కాదని పరాయి మగాడిపై కన్నేత్తి చూసినా, వివాహేతర సంబంధం ఉందని హద్దులు దాటినా ఏ భర్త దీనిని చూస్తూ సహించలేడు. ఒకవేళ భార్య ఇలాంటి వక్రమార్గంలో అడుగులేసిస్తుందని భర్తకు తెలిస్తే గనుక.. భర్త భార్యను మందలించడమో లేదంటే హత్య చేయడమో చేస్తాడు. కానీ రాజస్థాన్ లో ఓ భర్త మాత్రం తన భార్యను హోటల్ లో బందించి పరాయి మగాడితో పడుకోవాలంటూ టార్చర్ పెట్టాడు. ఇంతటితో ఆగకుండా ఇదే మన కల్చర్ అంటూ తీవ్రంగా హింసకు గురి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అమ్మరు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ ఏడాది జూన్ లో అమ్మరు దగ్గరి బంధువుల్లోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజుల ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక కొన్ని రోజులు గడిచాక అమ్మరు తన భార్యను తీసుకుని రాజస్థాన్ లోని బికనీరర్ కు మకాం మర్చాడు. ఇక ఇక్కడికి వచ్చాక అమ్మరు స్థానికంగా ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పని చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి అమ్మరు తన భార్యను తను పని చేస్తున్న హోటల్ లోకి తీసుకెళ్లి ఓ గదిలో బంధించాడు. ఇక ఇంతటితో ఆగక.. వైఫ్ స్వాపింగ్ గేమ్ ఆడాలంటూ భార్యన టార్చర్ పెట్టేవాడు. నేను మరోక మహిళతో శారీరకంగా కలుసుకుంటే, నువ్వు కూడా పరాయి మగాడితో శారీరకంగా కలుసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చి ఇదే అసలైన కల్చర్ అంటూ తెలిపాడు.
భర్త మాట విన్న భార్య ఒక్కసారిగా షాక్ కు గురైంది. నేను ఇలాంటి పని చేయలేనంటూ భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో అలెర్ట్ అయిన భర్త.., భార్య సెల్ ఫోన్ లాక్కుని రూమ్ లోని బంధించాడు. భార్యను తాళ్లతో కట్టేసి, డ్రగ్స్ అలవాటు చేశాడు. ఇదే కాకుండా భార్య ముందే పరాయి మహిళలతో శారీరక కోరికలు తీర్చుకుంటూ భార్యను దారుణంగా దాడి చేస్తూ శారీరకంగా తీవ్ర హింసకు గురి చేసేవాడు. దీంతో పాటు అత్తమామలకు ఫోన్ చేసి.. నాకు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశాడు.
ఇక భర్త టార్చర్ ను భరించలేని భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఖంగుతిన్న భర్త భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే భార్య తన పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి భర్త చేస్తున్న దారుణాన్ని వివరించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ మేనమామ రాజస్థాన్ వెళ్లి ఆ దుర్మార్గుడి నుంచి రక్షించి తన కోడలిని పుట్టింటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత భర్త దారుణంపై ఆ మహిళ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.