ఈ రోజుల్లో కొందరు వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలకు పావులు కదుపుతున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా యధేచ్చగా చీకటి కాపురాలను నిర్మించుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఆరుగురు పిల్లల తల్లి.. మేనల్లుడితో లేచిపోయింది.
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న ఎన్నో దారుణాలను చూడాల్సి వస్తుంది. పైగా కొందరు వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలకు పావులు కదుపుతున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా యధేచ్చగా చీకటి కాపురాలను నిర్మించుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఆరుగురు పిల్లల తల్లి.. లవర్స్ డే రోజు మేనల్లుడితో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి బంధువులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ మహిళ (50) నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మహిళ ఈమె కంటే వయసులో 20 ఏళ్లు చిన్నవాడైన మేనల్లుడిపై మనసు పడింది. లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్లుగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక సమయం దొరికినప్పుడల్లా ఎంచక్కా రొమాన్స్ కు తెరలేపేవారు. అలా చాలా కాలం పాటు వీరి చీకటి కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతూ వచ్చింది. కానీ, ఆ మహిళ భర్తతో కంటే ప్రియుడితోనే ఉండేందుకు ఇష్టపడింది.
ఇందుకోసం పక్కా ప్లాన్ తో.. ఆ మహిళ ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజు ఇంట్లో ఉన్న రూ.60 వేల నగదును తీసుకుని రాత్రి 11 గంటలకు మేనల్లుడితో కలిసి లేచిపోయింది. ఇక ఆ మహిళ భర్త నిద్రలేచి చూడగా.. ఇంట్లో భార్య కనిపించలేదు. అనేక సార్లు ఫోన్ చేశాడు. ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ మహిళ భర్త.. నా భార్య లవర్స్ డే రోజు నుంచి కనిపించడం లేదని, ఆమెతో పాటు మా మేనల్లుడు కూడా కనిపించడం లేదంటూ.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మేనల్లుడితో లేచిపోయిన ఆరుగురు పిల్లల తల్లి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.