మాములుగా భర్తలు భార్యలను బెదిరించి మాట వినాలని చెప్పడమో, లేదంటే తమకు నచ్చిన పనులను చేయించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఓ దుర్మార్గపు భర్త భార్యను తుపాకీతో బెదిరించి ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెడతారు. అవును.. మీరు విన్నది నిజమే. భార్యను బెదిరించి భర్త అంతలా చేసిన దారుణం ఏంటి అనుకుంటున్నారా? ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త డాక్టర్ గా పని చేస్తుండగా, భార్య బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తుంది.
ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించారు. అలా కొన్ని రోజులు గడిచాయో లేదో.., అప్పుడే భర్త తన అసలు క్యారెక్టర్ ను బయటపెట్టాడు. అయితే పెళ్లైన కొంత కాలం వరకే ఈ భార్యాభర్తలు ఆనందంగా గడిపారు. ఇక రోజులు గడిచే కొద్ది భర్త రాక్షసుడిలా తయారయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యతో అసహజ రీతిలో శృంగారం చేయాలని భర్త కోరుకుంటున్నాడు. కానీ భార్య మాత్రం భర్త కోరికను కాదంటూ వస్తూ ఉంది. ఇక్కడే భర్తకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అనేక సార్లు చెప్పి చూశాడు, అయినా భార్య మాత్రం భర్త మాట వినలేదు. ఇక చేసేదేంలేక లేక భర్త భార్యను తుపాకీతో బెదిరించి అసహజ శృంగారం చేయాలనుకున్నాడు.
ఇక అతను అనుకున్నదే ఆలస్యం.. అదే పనిగా భార్యను తుపాకీతో బెదిరించి రోజూ అసహజ రీతితో శృంగారం చేస్తున్నాడు. ఇంతటితో ఆగుతున్నాడా అంటే అదీ లేదు. తనకు అదనపు కట్నంగా కింద రూ.10 లక్షలు తీసుకు రావాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇన్నాళ్లు భర్త తీరుతో విసుగు చెందిన భార్య ఇక తట్టుకోలేకపోయింది. భర్త చేస్తున్న దారుణంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భార్యను తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో శృంగారం చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.