రాజమహేంద్రవరానికి చెందిన నాగదేవి దిల్ సుఖ్ నగర్ లో ఉండే సాయి శివ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదివారు. అప్పుడే నాగదేవి, సాయి శివ ప్రేమించుకున్నారు. చదువు తర్వాత సాయి శివకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. 10 నెలల కిందట ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. రాజేంద్రనగర్ పరిధి చైతన్య విలాస్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టాడు. వీరికి వివాహం జరిగినప్పటి నుంచి నాగదేవి భర్త సాయి శివ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ విధులు నిర్వహిస్తున్నాడు. నాగదేవి బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. శివ సోదరి వివాహం ఉండటంతో దిల్ సుఖ్ నగర్ వచ్చాడు. సోదరి పెళ్లి తర్వాత తమ పెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని భార్యతో చెప్పాడు. మంగళవారం రాత్రి నాగదేవి భర్తకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరింది. పెళ్లి తర్వాత వస్తానని చెప్పడంతో వెంటనే వీడియో కాల్ చేసి ఇంటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఫోన్ పెట్టేసి అపార్ట్మెంట్ పక్క ఫ్లాట్ వారిని అప్రమత్తం చేశాడు. వారు వెళ్లేలోపే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
స్థానిక క్షేత్ర హోమ్స్ అపార్ట్మెంట్‌లోని రెండో ఫ్లోర్‌లో ఉన్న 203 ఫ్లాట్లో నాగదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, భర్తతో గొడవపడి భార్య నాగదేవి తన భర్తకి వీడియో కాల్ చేసి లైవ్ చూపిస్తూ ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగరిత్యా బెంగళూరులో ఉంటున్న భర్త సాయి శివ వారానికి రెండు రోజులు మాత్రమే హైదరాబాద్ లోని ఇంటికి వచ్చి భార్యను కలుస్తూ ఉండేవాడని స్థానికులు తెలుపుతున్నారు. భార్య నాగదేవి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. భార్యాభర్తల మధ్య ఉదయం ఫోన్ లో వాగ్వాదం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తన భర్త సాయి శివ తనను సరిగ్గా చూసుకోవడం లేదని నాగదేవి ఇప్పటికే పలుమార్లు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిందని సమాచారం.
నిన్న తీవ్ర స్థాయిలో దంపతుల మధ్య పోన్ లో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగే సరికి భర్తకు వీడియో కాల్ చేసి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అంటున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.