నేటి కాలంలో అమ్మాయిలను ఎంతో జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. బయట ఆడది కనిపిస్తే చాలు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలు అందంగా కనిపిస్తే చాలు ఐలవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారం, హత్యలు చేస్తున్నారు. ఇలాంటి కఠినమైన రోజుల్లో ప్రతీ తండ్రి తమ కూతుళ్లను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమా, గీమా అంటూ చెడు మార్గాల్లో అడుగులు వేస్తూ చివరికి కనిపెంచిన కన్నవాళ్లకు తీరని అవమానాన్ని దగ్గర చేస్తున్నారు.
సరిగ్గా ఇదే భయంతో పెంచిన ఓ తండ్రికి ఇద్దరు కూతుళ్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తన ఇద్దరు కూతుళ్లకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తండ్రి స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యుడిని సంప్రదించాడు. పరీక్షించిన ఆ వైద్యుడు నీ ఇద్దరు కూతుళ్లు గర్భవతి అయ్యారంటూ తెలిపాడు. ఈ మాట విన్న ఈ తండ్రి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. తదనంతర పరిణామాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రక్కాడితే డొక్కాడని కుటుంబాలు కావడంతో తండ్రి ఎంతో కష్టపడి తన కూతుళ్లను బాగా చదవిస్తున్నాడు. ఆ కూతుళ్లు పెరిగి పెద్దవారయ్యారు. పెద్ద కుమార్తె డిగ్రీ చదువుతుండగా, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతోంది. కాగా ఇటీవల ఆ ఇద్దరు అమ్మాయిల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తండ్రి తల్లిడిల్లాడు. దీనిని గమనించిన తండ్రి వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లి ఓ వైద్యుడిని సంప్రదించాడు.
పరీక్షలు జరిపిన ఆ డాక్టర్.. నీ ఇద్దరు కూతుళ్లు గర్భం దాల్చారని, పెద్ద కుమార్తెకు ఆరో నెల, రెండో కుమార్తె తొమ్మిదో నెల అని చెప్పాడు. ఆ వార్త విన్న ఆ తండ్రి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పెళ్లి కాకుండానే అతని కూతుళ్లు గర్భం దాల్చడంతో అతని గుండె పగిలినంత పనైంది. ఈ అవమానాన్ని ఎలా భరించాలో ఆ తండ్రికి తెలియదు. ఈ విషయం ఊరంతా తెలిస్తే ఇన్నాళ్లు కాపాడుకుంటూ వస్తున్న నా పరువు బజారున పడుతుందని వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ సమయంలో ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు దాపరించాయి.
ఇక చేసేదేం లేక ఆ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇన్నాళ్లు కూతుళ్లను ఎంతో కష్టపడి పెంచిన ఆ తండ్రికి కనిపెంచిన తన ఇద్దరు కూతుళ్లు భరించలేని అవమానాన్ని మిగిల్చి చివరికి తండ్రిని ప్రాణాలతో లేకుండా చేశారు. బరితెగించి ప్రవర్తించి తండ్రి మరణానికి కారణమైన ఈ ఇద్దరు కూతుళ్ల ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.