పైన ఫొటోలు కనిపిస్తున్న మహిళ పేరు శైలజ (22). ఆమెకు చదువుకునే రోజుల్లో స్థానికంగా ఉండే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు భర్త భార్యను బాగానే చూసుకున్నాడు. అలా రెండేళ్ల కాలానికి ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి భర్త ప్రవర్తనలో మార్పొచ్చి రాక్షసుడిలా మారిపోయాడు. కట్టుకున్న భార్య అని చూడకుండా నానా హింసకు గురి చేశాడు. భర్త నరకాన్ని భరించలేని భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? భర్త రాక్షసుడిలా మారిపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం సులానగనర్ ప్రాంతానికి చెందిన శైలజ (22) తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే చదుకునే రోజుల్లో శైలజకు రామన్నపేటకు చెందిన ఎలిషా అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. కొంత కాలానికి వీరి పరిచయం ప్రేమగా మారిపోయింది. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకుని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరిద్దరి కులాలు వేరు కావడంతో మొదట్లో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు తల్లిదండ్రులను ఎదురించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు.
అలా పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ఇక అప్పటి నుంచి భర్త తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేశాడు. వరకట్నం తేవాలంటూ భార్యను వేధించేవాడు. ఇక భర్త ఇంతటితో ఆగకుండా.. పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కూడా నడిపించాడు. ఇవన్నీ శైలజ చూసి చూడనట్లుగా వదిలేసింది. కానీ భర్త మాత్రం వరకట్నం తేవాలంటూ భార్యను మరింత టార్చర్ పెట్టాడు. భర్త హింసను భరించలేని భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో జీవితంపై విరక్తి కలిగిన శైలజ ఇటీవల గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన కటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ శైలజ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. శైలజ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం శైలజ తల్లిదండ్రులు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.