ఆమెకు కూతురు ఉంటే ఎంతో ఇష్టం. బాగా చదువుని జీవితంలో గొప్పగా స్థిరపడాలని తల్లి కూతురుకు చెబుతుండేది. ఇందులో భాగంగానే కూతురిని ఓ మంచి కాలేజీలో జాయిన్ చేసింది. మంచిగా చదివి ఉద్యోగం సంపాదించాలనే కోరేది. ఇక దీంతో పాటు మంచి సంబంధం చూసి కూతురుకి పెళ్లి చేయలని తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ రోజు తల్లి ఇంట్లో కూతురుని అలా చూసి తట్టుకోలేకపోయింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన అసిత్ కుమార్ డెరియా అనే వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి బోనా శ్రీ డెరియా (19) అనే కూతురు కూడా ఉంది.
అయితే ఈ కుటుంబం గత కొంత కాలం నుంచి హైదరాబాద్ సనత్ నగర్ లోని రాజేశ్వరీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లికి కూతురు బోనాశ్రీ అంటే ఎంతో ఇష్టం. కూతురుని ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయిలో చూడాలని తల్లి ఎంతో ఆశపడింది . ఇదిలా ఉంటే బోనాశ్రీ బేగంపేటలోని ఓ ప్రముఖ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఇకపోతే ఇటీవల వెలువడిన ఫలితాల్లో బోనాశ్రీకి తక్కువ మార్కులు వచ్చాయి. ఇదే విషయం తల్లికి తెలిసింది. కోపంతో ఊగిపోయిన తల్లి గురువారం కూతురు బోనాశ్రీని మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని మందలించింది.
తల్లి అలా అనడంతో కూతురు బోనాశ్రీ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయలో తెలియక ఏడుస్తూ ఇంట్లో కూర్చుంది. ఇక చివరికి బోనాశ్రీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఇలాంటి బతుకు నాకు వద్దనుకుని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక తల్లి ఇంటికి వచ్చి చూడగా బోనాశ్రీ తలుపులు వేసుకుని ఉంది. ఏం జరిగిందని చూసేసరికి బోనాశ్రీ ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. కూతురుని తల్లి అలా చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే స్థానికులను పిలిపించి కూతురుని కిందకు దించింది. కానీ అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో బోనాశ్రీ తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.