భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ చిన్న చిన్న గొడవలకే కొంత మంది భార్యభర్తలు విడాకులు తీసుకోవడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక మరి కొందరు మహిళలు అయితే భర్తతో సుఖం దక్కలేదని అతనితో విడిపోయి చివరికి మరొకడిని వివాహేతర సంబంధాన్ని నడిపించడం ఇదీ కాకపోతే, ఒంటరిగా జీవించడం చేస్తుంటారు. అయితే సరిగ్గా ఇలాగే భర్తతో విడిపోయిన ఓ వివాహిత కొన్నాళ్ల నుంచి ఒంటరిగా జీవించింది. ఇక ఉన్నట్టుండి ఆ మహిళ గురువారం నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని స్వర్ణభారతీనగర్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న చిట్టెమ్మ అనే మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులు మాత్రమే చిట్టెమ్మ భర్తతో సంతోషంగా గడిపింది. ఆ తర్వాత భర్తతో ఆ మహిళకు కోరుకున్న సఖం దక్కకపోవడంతో చిట్టెమ్మ అతనికి గుడ్ బై చెప్పింది. ఇక అప్పటి నుంచి చిట్టెమ్మ ఒంటరిగా ఉంటూ స్థానికంగా వాలంటీర్ గా పని చేస్తుంది. అలా కొంత కాలం పాటు చిట్టెమ్మ తన జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చింది.
ఇదిలా ఉండగా.. గురువారం నుంచి చిట్టమ్మ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఇక సాయంత్రం అయిన కూతురు చిట్టెమ్మ ఇంటికి రాకపోవడంతో తల్లి ఖంగారు పడింది. ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లి అటు ఇటు వెతికింది. కానీ ఎంత వెతికినా కూతురు జాడ మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోనే చిట్టెమ్మ తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు చిట్టెమ్మ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చిట్టెమ్మ కనిపించకుండా పోవడంతో తల్లి, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.