ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో తమ్ముడు సన్నిహితంగా కలిసున్నాడనే కారణంతో అన్న తమ్ముడిని నరికి చంపాడు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం. ఇదే గ్రామంలో రామకృష్ణ, నరేష్ సోదరులు నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. అయితే గతంలో నరేష్ భార్య భర్తతో విభేదాలతో నరేష్ ను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నరేష్ స్థానికంగా వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ తన తల్లి వద్దే ఉంటున్నాడు.
ఇదిలా ఉంటే ఇటీవల నరేష్ తన అన్న రామకృష్ణ భార్యతో శారీరకంగా కలుసుకున్నాడు. దీనిని చూసిన అన్న రామకృష్ణ భార్యతో పాటు అతని సోదరుడైన నరేష్ పై కోపంతో చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ భయంతోనే భార్య భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. ఇక నరేష్ కూడా భయంతో ఇంటికి రావడం మానేశాడు. దీంతో రామకృష్ణ భార్యకు ఫోన్ చేసి.. ఇంటికి రావాలంటూ చెప్పేవాడు. అయినా వినని భార్య నేను రానంటూ తెగేసి చెప్పింది. కానీ రామకృష్ణ తన భార్య, తమ్ముడు నరేష్ పై కోపంతో ఊగిపోతున్నాడు. రామకృష్ణ ఎలాగైన సోదరుడు నరేష్ ను చంపాలనుకున్నాడు.
ఇక ఇందులో భాగంగానే రామకృష్ణ తమ్ముడు నరేష్ తో.. ఇక నుంచి మనమిద్దరం కలిసి ఉందామని తమ్ముడిని మచ్చిక చేసుకున్నాడు. దీనిని నిజమేనని నమ్మిన నరేష్ అన్నతో స్నేహంగా కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల దీపావళి రోజు అన్నదమ్ములు ఇద్దరూ రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చి పడుకున్నారు. అర్థరాత్రి నిద్రలేచిన రామకృష్ణ.. తమ్ముడిని హత్య చేయాలనుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న గొడ్డలి చేతబట్టిన రామకృష్ణ.. తమ్ముడు నరేష్ ని.. తమ్ముడు లేరా లేరా అంటూ నిద్రలేపి మరీ నరేష్ ని దారుణంగా హత్య చేశాడు.
అన్న రామకృష్ణ దాడిలో తమ్ముడు నరేష్ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తమ్ముడిని చంపిన తర్వాత రామకృష్ణ ఫొటోలు తీసుకుని బంధువులకు పంపాడు. ఇక ఇంతటితో ఆగకుండా రోడ్డుపైకి వచ్చి నా తమ్ముడు నా భార్యతో శారీరకంగా కలుసుకున్నాడని.. ఈ కారణంతోనే నా తమ్ముడు నరేష్ ని హత్య చేశానని తెలిపాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు రామకృష్ణను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.