ఈ మధ్యకాలంలోని యువత చెడు దారుల్లో వెళ్తూ నానా హంగామా క్రియేట్ చేస్తున్నారు. పాశ్చత్య పోకడలను అలవాటుగా మార్చుకుని ఇదే కొత్త సంస్కృతి అంటూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ మధ్య అమ్మాయిలు కూడా మద్యం తాగడం ఓ ఫ్యాషన్ గా మారిపోతుంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువ. ఇక పబ్బులు అంటూ అంత గబ్బు గబ్బు చేస్తూ చివరికి కటకటాల పాలవుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటి నడి రోడ్డుపై చిందులేసిన ఓ యువతి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే? అది కర్ణాటకలోని బొమ్మనహళ్లి పరిధిలోని ఎలక్ట్రానిక్ సిటీ నీలాంద్రి రోడ్డు. ఇక్కడే దీపావళి పండగ రోజు ఓ యువతి అతిగా మద్యం సేవించి బైక్ పై హల్చల్ చేసింది. ఇక బైక్ పై వెనక్కి మళ్లీ కూర్చుని మద్యం మత్తులో అరుపులు, కేకలు వేసింది. ఇక ఇంతటితో ఆగక వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
యువతి వీరంగాన్ని చూసిన కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదే వీడియోలు చూసిన పోలీసలు కేసు నమోదు చేసుకుని ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. పాశ్చత్య పోకడల సంస్కృతి పేరుతో కొందరు యువతులు మద్యం మత్తులో నడి రోడ్డుపై చిందులు వేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.