నేటి సమాజంలో ప్రేమ శారీరక అవసరాలు తీర్చే ఆయుధంగా మారిపోయింది. కొందరు కామాంధులు తమ కోర్కెలు తీర్చుకోవటానికి ప్రేమను వాడుకుంటున్నారు. తమ కోర్కెలు తీరిన తర్వాత ప్రియురాళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు. బ్రేకప్ చెబుతున్నారు. అవతలి వాళ్లు బ్రేకప్‌కు ఒప్పుకోకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా, ఓ యువకుడు తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పి మరో యువతిని లైన్‌లో పెట్టాడు. మొదటి ప్రియురాలు ఇందుకు ఒప్పకోకపోవటంతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని కన్హాజెడ్, అలామిపల్లికి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఇతడికి నంద అనే 19 ఏళ్ల కూతురు ఉంది. నంద హైస్కూల్ చదివే సమయం నుంచి అబ్ధుల్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ప్రస్తుతం నంద డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొన్ని నెలల వరకు వీరి ప్రేమ వ్యవహారం సజావుగా సాగింది. అయితే, తాజాగా, అబ్దుల్ ఆమెకు బ్రేకప్ చెప్పాడు. మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అయితే, అబ్దుల్‌ను వదులుకోవటానికి నంద ఇష్టపడలేదు. అతడ్ని ఒప్పించటానికి ప్రయత్నించసాగింది. దీంతో అతడు ఆమెను బెదిరించాడు. నంద ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు.
ఆవెంటనే ఆమె ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేశాడు. అయినా ఆమె వదల్లేదు. బంధువు నెంబర్‌నుంచి అతడికి ఫోన్ చేసింది. చనిపోతానని బెదిరించింది. తర్వాత అతడి కాల్‌ను కట్ చేసింది. అబ్దుల్ ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ తీయ్యలేదు. దాదాపు 32 సార్లు ఆమె ఫోన్‌కు కాల్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే నంద ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. తమ కూతురి మరణానికి అబ్ధుల్ కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.