ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. స్థానికంగా బ్యూటిషియన్ గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లైన వ్యక్తితో పరిచయ ఏర్పడింది. ఆ పరిచయమే రాను రాను వివాహేతర సంబంధంగా మారింది. ఇదిలా ఉంటే, ఇటీవల ఆ వివాహిత ప్రియుడితో కలిసి ఓ లాడ్జికి వెళ్లింది. అందులో ఏం జరిగిందంటే?
ఆమెకు అప్పటికే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో కొన్నాళ్ల పాటు బాగానే సంసారం చేసింది. అయితే కొంత కాలం నుంచి ఈ మహిళ స్థానిక పట్టణంలో బ్యూటీషియన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ పెళ్లైన వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయమే ఇద్దరి మధ్య కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఎంచక్కా రొమాన్స్ ను పిండుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సడెన్ గా ఓ రోజు ఆమె, భర్త ఇద్దరు పిల్లలను కాదని ప్రియుడితో లాడ్జికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రం ఉడ్మ పరిధిలోని ముక్కునోత్ గ్రామంలో దేవిక (34) అనే మహిళ నివాసం ఉంటుంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఆమె గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అలా కొంత కాలం తర్వాత స్థానిక పట్టణ కేంద్రంలో బ్యూటీషియన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే దేవికకు ముల్లియూర్ పరిధిలోని బోవికానం గ్రామానికి చెందిన సతీష్ (36) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేవికకు ఆమె భర్తతో గొడవలు జరిగాయి. దీంతో ఆమెకు భర్తతో ఉండడం ఇష్టం లేక.. పిల్లలతో పాటు భర్తకు దూరంగా ఉంటుంది.
ఇకపోతే.. దేవిక ఎప్పటి నుంచో తన ప్రియుడు సతీషం ని పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి సతీష్ నిరాకరిస్తూ వచ్చాడు. దేవిక పట్టుబట్టడంతో పాటు రాను రాను సతీష్ ను మరింత టార్చర్ పెట్టింది. దీంతో ఆమె ప్రియుడు ఎలాగైన దేవికను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే.. దేవిక ఇటీవల బార్బర్, బ్యూటీషియన్ యూనియన్ జిల్లా సమావేశాలకు హాజరైంది. ఈ సమావేశానికి ఆమెతో పాటు ప్రియుడు సతీష్ కూడా వెంట వెళ్లాడు. సమావేశం అనంతరం ఇద్దరు కలిసి కేరళలోని కాసర్ గోడ్ పరిధిలోని ఓ లాడ్జికి వెళ్లారు. ఇక అందులోకి వెళ్లాక ఆమె ప్రియుడు దేవికను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ గదికి తాళం వేసి నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లాడ్జిలో ఉన్న దేవిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.