అవినాష్- దీపిక ఇద్దరు భార్యాభర్తలు. ఇటీవల వీరికి ఓ కుమారుడు జన్మించాడు. దీంతో ఆ దంపతులిద్దరూ వారి కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల భర్త పొద్దున్నే నిద్రలేచి ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో భార్య వెంటనే.. బ్రష్ చేయకుండా ముద్దుపెట్టుకోవద్దంటూ తెలిపింది. దీంతో ఇదే విషయమై భార్యాభర్తలకు తీవ్ర గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా కేరళలో వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పాలక్కాడ్ జిల్లా మన్నార్క్కాడ్ కరక్కురిస్సీలో 30 ఏళ్ల అవినాష్ నివాసముంటున్నాడు. ఇతనికి గతంలో వివాహం కాగా మొదటి భార్యకు విడాకులిచ్చి 2019లో దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఇటీవల అవినాష్ పొద్దున్నే నిద్రలేచి తన కుమారుడిని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. భార్య వెంటనే గమనించి.. బ్రష్ కుండా వాడిని ముద్దు పెట్టుకోవద్దంటూ తెలిపింది. ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ గొడవకు దిగారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: భార్యపై మొదటి నుంచే భర్తకు డౌట్.. ఓ రోజు భార్య చేతులు, కాళ్లు కట్టేసి!
ఈ క్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరగడంతో భర్త అవినాష్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యను ఇంట్లో ఉన్న కొడవలితో దారుణంగా హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే దీపిక ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవినాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.