కొత్త ప్రియుడితో ఉండటం కోసం యువతి దారుణానికి తెగబడింది. పాత ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టింది. అంతటితో ఆగకుండా వాటన్నింటినీ వీడియో తీసింది. దీంతో పోలీసులు..
ప్రేమికుల మధ్య గొడవలు జరగటానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. గివ్ అండ్ టేక్ పాలసీలా ఇద్దరూ ఆలోచిస్తే.. కొద్ది రోజులకే ఆ ప్రేమ పెటాకులు అవుతుంది. ఇద్దరూ గుడ్ బై చెప్పుకుని విడిపోతే పర్లేదు. కానీ, ఈ విడిపోవటం ఒకరికి ఇష్టం ఉండి. ఇంకొకరికి ఇష్టం లేకపోతే గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. తాజాగా, ఓ యువతి తన మాజీ ప్రియుడ్ని వదిలించుకోవటానికి మాస్టర్ ప్లాన్ వేసింది. అది వర్కవుట్ కాకపోవటంతో దారుణానికి తెగించింది. కిడ్నాప్ చేసి మరీ అతడ్ని హింసించింది. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని వార్కాల ఆయిరూర్‌కు చెందిన లక్ష్మీప్రియ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే, గత కొన్ని నెలలనుంచి ఆ యువతి వేరే యువకుడితో ప్రేమలో పడింది. పాత ప్రియుడ్ని నిర్లక్ష్యం చేయసాగింది. ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రియుడినుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అతడు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీంతో కొత్త ప్రియుడితో స్కెచ్ వేసింది. మాజీ ప్రియుడ్ని కిడ్నాప్ చేసి హింసించాలని అనుకుంది. అనుకున్నట్లుగానే కొంతమంది టీంగా ఏర్పడి మాజీ ప్రియుడ్ని కిడ్నాప్ చేశారు.
కారులో అతడ్ని కొట్టుకుంటూ కొచ్చి బైపాస్ దగ్గరలోని ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ బట్టలు విప్పించి దారుణంగా చితకబాదారు. బలవంతంగా బీరు తాగించటానికి ప్రయత్నించారు. అతడు ఒప్పుకోకపోవటంతో మొబైల్ ఛార్జర్‌తో నాలుకపై కొట్టారు. బీర్ బాటిల్‌తో నెత్తిపై కొట్టారు. దీన్నంతా ఆ యువతి వీడియో తీసింది. తర్వాత అతడ్ని వదిలేశారు. బాధితుడు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.