ఆమెకు పెళ్లై ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్తతో పాటు ఆమె కాపురం కొంత కాలం పాటు సంతోషంగా గడిచింది. ఉన్నట్టుండి ఈ మహిళ సంసారంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఎంతో గొప్పగా ఊహించుకున్న ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగి పిల్లలతో పాటు తానూ శవంలా దర్శనమిచ్చింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి పరిధిలోని కోహెళ్లి గ్రామం. ఇక్కడే సునీతా తుకారమ్ అనే మహిళ నివాసం ఉంటుంది.
పెళ్లై ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. పెళ్లైన కొంత కాలం పాటు సునీతా దంపతుల సంసారం బాగానే సాగింది. కానీ రోజులు మారుతున్న వీరి సంసారంలో కుటుంబ కలహాలు, మనస్పర్ధలు వచ్చి చేరాయి. ఇక సంసారం అన్నక ఇవన్నీ మాములే అనుకుంది సునీత. కానీ రాను రాను ఆ కలహాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక తీవ్ర మనస్థాపానికి గురైన సునీతకు బతుకు మీద విరక్తి కలిగింది. దీంతో ఆదివారం రోజు సునీత తన ముగ్గురు పిల్లలను వెంటపెట్టుకుని సమీప గ్రామంలోని ఓ చెరువులో దూకి సునీత ఆత్మహత్య చేసుకుంది.
ఇక మరుసటి రోజు ఆ చెరువులో ముగ్గురు పిల్లలతో పాటు సునీత శవమై తేలింది. దీనిని గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న విచారణ చేపడుతున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే సునీతా తన ముగ్గురు ఆడ పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు భావిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇది కూడా చదవండి: 16 ఏళ్ల కూతురికి కడుపు చేసిన ఆటో డ్రైవర్.. కోపంతో తల్లి!