సమాజంలో కొందరి మనుషుల ఆలోచనలు, ప్రవర్తన ఊహకు కూడా అందడం లేదు. ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు మరణిస్తే వారితో చనిపోయేవాళ్లను చూసి ఉంటాం. వారితో గడిపిన క్షణాలు తలుచుకుంటూ వారి బంధాలను గుర్తు చేసుకుంటూ వారు లేకుండా ఉండేలేక కొందరు వారితో పాటే ప్రాణాలు తీసుకుంటుంటారు. ఇదిలా ఉంటే ఓ తల్లి తన కూతురు మరణించిందని ఆ శవాన్ని నాలుగు రోజులు తనతో పాటే ఇంట్లో ఉంచుకుంది.
ఇటీవల కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక మాండ్య జిల్లాలోని హాలహళ్లి గ్రామం. ఇదే ప్రాంతంలో నాగమ్మ అనే మహిళ తన కూతురు రూపతో కలసి స్థానికంగా నివాసం ఉంటుంది. అయితే నాగమ్మ భర్తతో గతంలో విడిపోయి కూతురితో పాటే ఉంటుంది. కాగా ఇటీవల నాగమ్మ కూతురు రూప ఉన్నట్టుండి మరణించింది.
ఇది కూడా చదవండి: Warangal: కూతురుని అల్లారుముద్దుగా పెంచిన తండ్రి. కానీ.., ఈ యువతి మాత్రం..!
కూతురు మరణించిందని తల్లి నాగమ్మ తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తూ కూతురి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుంది. నాగమ్మ శవంతో పాటు బయటకు రాకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రోజులు గడిపింది. ఈ క్రమంలోనే వారుంటున్న ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. ఏంటా అని స్థానికులు అంతా ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.
తలపులు తీసి లోపలికి వెళ్లి చూసే సరికి రూప మరణించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం రూప శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.