కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఎంతటి దారుణాలకైన తెగబడుతున్నారు. కొందరు దొంగతనాలు, ఇంకొందరు కిడ్నాప్ లకు పాల్పడుతుంటే ఓ ముఠా గ్యాంగ్ మాత్రం ఏకంగా ఒంటరి మహిళలే టార్గెట్ గా చేసుకుని మాయమాటల చెప్పి నమ్మించి వీడియోలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత తీసుకున్న వీడియోలు బాధితులకు చూపించి డబ్బులు ఇవ్వాలని.. లేకుంటే నీ వీడియోలు బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ కు దిగేవారు. ఇలా ఈ ముఠా గ్యాంగ్ వలలో చిక్కుకున్న ఓ బాధిత మహిళ ఎట్టకేలకు బయటపడి పోలీసులకు పట్టించింది. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ గ్యాంగ్ లీలలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బనశంకరి పరిధిలోని మంగళ, రవి దంపతులు కాగా శివకుమార్, శ్రీనివాస్‌తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని నమ్మించి ఎవరూ లేని ప్రదేశాలకు తీసుకెళ్తారు. నమ్మంచి చేసేటివన్నీ చేసి తెలియకుండా వీడియోలు తీస్తారు. అలా తీసిన వీడియోలను బాధితులకు చూపించి డబ్బులు ఇవ్వాలని.., లేకుంటే మీ వీడియోలు బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ కు దిగేవారు. అలా ఎంతోమందిని నమ్మించి మోసం చేయడం, వారి నుంచి డబ్బులు గుంజుకోవడం ఇదే వారి పని. ఇటీవల ఈ ముఠాకు చిక్కుకున్న బాధితురాలి వద్ద నుంచి బంగారు చైన్, నగలు, రూ.84 వేల నగదు దోచుకున్నారని మహిళ తెలిపింది.
ఇక ఎట్టకేలకు వారి చెర నుంచి బయటపడిన మహిళ పోలీసులకు సమాచారాన్ని అందించింది. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ గ్యాంగ్ ముఠాను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నగలు, రూ.70 వేల నగదు, కారు, మొబైల్, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇలా డబ్బు కోసం కక్కుర్తిపడి ఒంటరి మహిళలను దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్న ఈ గ్యాంగ్ ముఠా దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.