కడపలో దారుణం చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. ఈ ఘటనతో వారి పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగిందంటే?
ఇతని పేరు షేక్ మహమ్మద్. మరో వారం రోజుల్లో ఇతని పెళ్లి. ఇంట్లో కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కాబోయే భార్య తల్లిదండ్రులు కూడా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొన్నిరోజుల్లో పెళ్లి అని అంతా సంభరపడిపోయారు. కట్ చేస్తే.. పెళ్లికి కొన్ని రోజులు ఉండగానే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి ఇది కలన లేక నిజమా అనేది తేల్చుకోలేకపోతున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కడప టూటౌన్ పరిధిలోని చిన్నబెస్తవీధిలో షేక్ రషీదాభాను-దర్బార్ బాషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్ల సంతానం. తండ్రి అనారోగ్యంతో మూడేళ్ల కిందటే మరణించాడు. అప్పటికే ఇద్దరు కుమర్తెలు పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఇకపెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ ఇలియాస్ కు మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా వివాహం జరగలేదు. దీంతో రెండవ కుమారుడు షేక్ మహమ్మద్ ఇసాక్ వివాహం చేయాలని తల్లి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు. మరో వారం రోజుల్లో పెళ్లి. ఇదిలా ఉంటే.. షేక్ మహమ్మద్ ఇలియాస్ తన స్నేహితుడితో పాటు ఓ చోట కూర్చుని మద్యం తాగుతున్నారు.
తన తమ్ముడు అబూబ్ అసర్ చూసి రెండో అన్న మహమ్మద్ ఇసాక్ ను అక్కడికి పిలిచారు. అక్కడికి వచ్చిన ఇసాక్ అన్న మహమ్మద్ ఇలియాస్ కు మద్దుతుగా మాట్లాడి తన చిన్న తమ్ముడు షేక్ అబుబసర్ పై చేయి చేసుకున్నాడు. ఇదే విషయంపై ముగ్గురు అన్నదమ్ములు తిట్టుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన చిన్న తమ్ముడు అబూబసర్ రెండవ అన్న షేక్ మహమ్మద్ ఇసాన్ ను కత్తితో పొడిచాడు. ఇతడి దాడిలో ఇసాక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడు షేక్ అబుబసర్ ను అరెస్ట్ చేశారు.