దంపతులు పొట్టకూటి కోసం తమ కూతుళ్లతో కలిసి గ్రామాల్లో సంచరిస్తూ సర్కస్ చేస్తున్నారు. అయితే సర్కస్ బాలికపై కన్నేసిన గ్రామంలోని ఓ 60 ఏళ్ల వృద్ధుడు.. రూ. 500 ఇస్తా.. వస్తావా అంటూ పరుష పదజాలంతో వేధించాడు.
సర్కస్ బాలికపై ఓ 60 ఏళ్ల వృద్ధుడు బరితెగించి ప్రవర్తించాడు. చింతచచ్చినా పులుపు చావలేదన్నట్లుగా.. రూ.500 ఇస్తా.. వస్తావా అంటూ తన వేకిలి చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇక వృద్దుడి దారుణాన్ని తట్టుకోలేని ఆ బాలిక ఏడుస్తూ.. వెంటనే జరిగిందంతా తన తల్లికి వివరించింది. తాజాగా వెలుగు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీకి చెందిన ఓ దంపతులు పొట్టకూటి కోసం తమ కూతుళ్లతో కలిసి గ్రామాల్లో సంచరిస్తూ సర్కస్ చేస్తున్నారు. అయితే ఈ దంపతులు జోగులాంబ గద్వాల జిల్లా ఉండపల్లి మండలం బొంకూరు గ్రామంలో ఇటీవల రాత్రి సర్కస్ ప్రదర్శించారు. ఇక సర్కస్ ప్రదర్శన పూర్తైన వెంటనే ఆ దంపతులు తమ గుడారంలోకి వెళ్లి కూర్చున్నారు. అయితే ఈ దంపతుల కూతురు మాత్రం బయట ఏదో పని చేస్తూ కనిపించింది. ఇక ఆ బాలికపై కన్నేసిన గ్రామంలోని ఓ 60 ఏళ్ల వృద్ధుడు.. తన వేకిలి చేష్టలతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రూ. 500 ఇస్తా.. వస్తావా అంటూ పరుష పదజాలంతో వేధించాడు.
దీంతో కన్నీళ్లు కార్చిన ఆ బాలిక.. వెంటనే జరిగిందంతా తన తల్లికి వివరించింది. ఇక కూతురి మాటలను విన్న ఆ తల్లి కోపంతో ఊగిపోయింది. వెంటనే ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి నిలదీసింది. ఆ సమయంలో వృద్ధుడు నోట్లో నీళ్లు నమిలాడు. ఇక ఇంతటితో ఆగని బాధిత బాలిక తల్లి.. ఆ దుర్మార్గుడి దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆ 60 ఏళ్ల వృద్ధుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.