వాళ్లిద్దరూ అన్నాచెల్లెలు. ఒకే కడుపులో రక్తం పంచుకుని పుట్టి, ఒకే చను పాలు తాగి పెరిగారు. ఇక వాళ్లు పెరిగి పెద్దవారయ్యారు. మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలని అన్న ఎన్నో కలలు కంటున్నాడు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ క్రమంలోనే చెల్లెలు ప్రేమా, గీమా అంటూ మరో యువకుడితో తిరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అన్న ఇది తప్పు అంటూ చెల్లెలికి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ చెల్లెలు మాత్రం.. తోడబుట్టిన అన్నను బలి చేసి తన ప్రేమను నిలుపుకోవాలనుకుని అన్నను దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ కథ చిత్రామ్ స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అది జార్ఖండ్ లోని పట్రాటు ప్రాంతం. ఇక్కడే రోహిత్, చంచల అనే అన్నాచెల్లెలు నివాసం ఉంటున్నారు. వాళ్లిద్దరు పెరిగి పెద్దవారై పెళ్లి వయసుకొచ్చారు. దీంతో అన్న మాత్రం చెల్లెలికి మంచి సంబంధాన్ని తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేయాలని కలలు కన్నాడు. ఈ తరుణంలోనే చెల్లెలు చంచల ఇజ్రాయేల్ అన్సారీ అనే యువకుడితో ప్రేమలో పడింది. దీంతో ఇద్దరు కలిసి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. చెల్లెలు చంచల దొంగచాటున ప్రియుడితో కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరుగుతోంది. ఈ క్రమంలోనే చెల్లెలి ప్రేమ వ్యవహారం అన్న చెవిన పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన అన్న చెల్లెలికి అర్థమయ్యేలా వివరించి చెప్పాడు.
కానీ అన్న రోహిత్ అలా చెప్పడంతో చెల్లెలు చంచలకు అస్సలు నచ్చలేదు. మా ఇద్దరిని విడగొట్టడానికి ఇలా చేస్తున్నాడనే కోపంతో ఊగిపోయి అన్న రోహిత్ పై పగ పెంచుకుంది. ఇక ఇదే విషయాన్ని చంచల తన ప్రియుడికి చెప్పింది. మా అన్న య్య మన ప్రేమకు అడ్డొస్తున్నాడని, ఎలాగైన అతనిని చంపేస్తే మనం సంతోషంగా కలిసి ఉండొచ్చని సలహాలు ఇచ్చింది. ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు.. సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో 2022 జూన్ 24న చంచల అన్నను నమ్మించి ఓ చోటకు తీసుకెళ్లింది. అక్కడికి ముందే చంచల ప్రియుడు వచ్చి కూర్చున్నాడు. దీంతో అక్కడికి చేరాక చంచల ప్రియుడితో కలిసి రోహిత్ ను దారుణంగా హత్య చేశారు.
ఇక అతని శవాన్ని ఏం చేయాలో తెలియక.. చంచల తన అన్న శవాన్ని ఇంట్లోనే గుంత తీసి పాతిపెట్టారు. అన్నను పాతి పెట్టిన చోట ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అలా రెండు మూడు రోజులు గడిచింది. రోహిత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. కానీ రోహిత్ జాడ మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియన రోహిత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంతటా వెతికారు. ఇక ఫలితం లేకపోవడంతో పోలీసులు రూటు మార్చారు.
లోతుగా విచారించిన పోలీసులు సొంత చెల్లెలు అయిన చంచలను ప్రశ్నించారు. ఆ యువతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఎందుకో ఆమెపై అనుమానం వచ్చింది. ఇక గట్టిగ విచారించే సరికి చంచల ఎట్టకేలకు ప్రియుడితో కలిసి నా అన్నను నేనే హత్య చేశానంటూ ఒప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తన ప్రియుడి కోసం సొంత అన్నను హత్య చేసిన ఈ చెల్లెలు క్రైమ్ స్టోరీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.