నేటి కాలంలో కొంతమంది మహిళలు తాళికట్టిన భర్తను కాదని పక్క చూపులు చూస్తున్నారు. ఇంతటితో ఆగకుండా అక్రమ సంబంధం పేరుతో భర్తను మోసం చేస్తూ పడక సుఖానికి అలవాటు పడుతున్నారు. ఇక ప్రియుడి మోజులో పడి చివరికి రక్తపాతానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు.. కట్టుకున్న భర్తను కాటికి పంపింది. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
అది జీడిమెట్ల షాపూర్ నగర్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ ప్రాంతం. ఇక్కడే సురేష్ (28), రేణుక (25) దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి 2016 వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇక భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొన్నేళ్ల పాటు వీరి కాపురం సంతోషంగా సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే భార్య రేణుక గత కొన్ని రోజుల నుంచి వ్యభిచారం నిర్వహిస్తుందని తెలుస్తుంది. అయితే ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరిగాయట.
ఇలాంటి పాడు పనులు చేయొద్దని భర్త అనేక సార్లు భార్యకు చెప్పి చూశాడని, అయినా వినని భార్య.. అదే పనిగా వ్యభిచారం చేస్తూ, నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఆదివారం రాత్రి రేణుక ఆహారం తీసుకురావాలని భర్తను బయటకు పంపింది. రాత్రి అయినా భర్త ఇంటికి రాలేదు. ఇక తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆ ఇంటి ఓనర్ నిద్రలేచి బయటకు రాగా.. సురేష్ మృతదేహం గోనె సంచిలో కనిపించింది. ఆ సీన్ చూసిన ఆ ఇంటి ఓనర్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా మృతుడి భార్య అయిన రేణుకను పోలీసులు విచారించారు. మొదట్లో తనకేం సంబంధం లేదని చెప్పి భార్య రేణుక.. తర్వాత నా భర్తను నేనే చంపానని ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో పాల్గొన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.