అతని ధ్యాస అంతా దేవుడి మీదే. ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను చివరికి ఆ భగవంతుడికే అంకితం చేశాడు. నిత్యం ఆ దేవుడి సేవలోనే ఉంటూ అనునిత్యం దేవుడి ధ్యాసలోనే ఉన్నాడు. చివరికి తన కళ్లముందు తన ప్రాణం పోతున్నా విషయం తెలిసినా కూడా.. ఆ దేవుడిని సైతం విడువ లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న దృశ్యాన్ని చూసి స్థానికులు కంట కన్నీరు పెట్టారు. అసలు ఈ విషాద ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామం.
బింగి ప్రసాద్ (46) అనే వ్యక్తి పురోహిత కుటుంబంలో జన్మించారు. పుట్టినప్పటి నుంచి తన ధ్యాసంత దేవుడి మీదే. అనునిత్య పూజలతో తన జీవితాన్ని ఆ భగవంతుడికే అంకితం చేశాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రెండు దశాబ్ద కాలం పాటు పౌరోహిత్యం చేస్తూ జాతకాలు, వాస్తుదోషంలో ఆరితేరాడు. అను నిత్య ఆ భగవంతుడిని స్మరిస్తూ తన వృత్తిని కొనసాగించాడు. అయితే ఇటీవల దుర్గమాత ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 5న అమ్మవారి నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. ఊళ్లో జనాలతో వెళ్లిన ప్రసాద్.. కాలువ వద్ద విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రసాద్ విగ్రహంతో పాటే కాలువలో పడ్డాడు.
అలా పడిన ప్రసాద్ కాలువలో ఏకంగా 10 కిలొమీటర్ల మేర కొట్టుకుపోయాడు. తను కాలువులో పడ్డాక కూడా అమ్మవారి విగ్రహాన్ని మాత్రం అస్సలు వదలేదు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు. అనంతరం పూజారి ప్రసాద్ ను గ్రామస్తులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కకపోవడంతో పురోహితుడు బింగి ప్రసాద్ శుక్రవారం ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద చివరికి శవమై కనిపించాడు. ఆ తర్వాత గాలింపు చర్యల్లో భాగంగా అధికారులు ప్రసాద్ మృతదేహాన్నివెలికితీసి అనంతరం అంత్యక్రియలు జరిపారు. కొన్ని దశాబ్ద కాలం పాటు దేవుడి ధ్యాసలోనే ఉండి చివరికి ఆ దేవుడి నిమజ్జనంలోనే ప్రాణాలు కోల్పోయిన ప్రసాద్ మరణంపై స్థానికులు విషాదంలో మునిగిపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.