తెలంగాణలోని ఓ జిల్లాలో తాజాగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి కారణం తెలుసుకుని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే?
ఈ మధ్యకాలంలో కొంత మంది సమస్యకు పరిష్కారం లేదన్నట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని, అనారోగ్య సమస్యలు వంటి కారణాలు చూపి చాలా మంది ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ తాజాగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రూరల్ మండలం తాటిపళ్లి గ్రామం. ఇక్కడే బొద్దుల సరోజన (50) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవించారు. ఇదిలా ఉంటే.. సరోజన గత నాలుగేళ్ల నుంచి పక్షవాతం, నరాల బలహీనతతో మంచానికే పరిమితమైంది. దీంతో సరోజనకు ఆమె భర్త సేవలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఆమె ఎటు కదల్లేని స్థితిలో ఉండడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రిళ్లు ఏడుస్తూ ఉండేది.
ఇక ఇలాంటి బతుకు ఎందుకు బతుకుతున్నానని ఆ మహిళ జీవితంపై విరక్తి చెందింది. అయితే సరోజన ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే సరోజన భర్త ఇటీవల ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఇదే సమయంలో ఆ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమె భర్తకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న ఆమె భర్త భార్యను అలా చూసి తట్టుకోలేకపోయాడు.
కానీ, ఫలితం లేకపోవడంతో ఆమె పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉంది. మృతురాలి భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్న సరోజన మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.