వాసంతి ఓ ఉన్నత పోలీసు అధికారి. ప్రజల్ని రక్షించాల్సిన ఆమె పెద్ద తప్పు చేసింది. ఆమె తప్పు ఆమె జీవితాన్ని నాశనం చేసింది. రాష్ట్రంలోని పోలీసులందరికీ ఓ గుణపాఠంగా మారింది..
ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే కొన్ని సార్లు భక్షకులుగా మారుతున్నారు. జనం కోసం పని చేయాల్సిన వారు జనం నెత్తి మీదకు ఎక్కి ఆడుకుంటున్నారు. స్వార్థం కోసం నేరస్తులుగా మారుతున్నారు. చివరకు పాపం పండి కటకటాల పాలవుతున్నారు. తాజాగా, ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ డబ్బు మీద ఆశతో పోలీస్ వృత్తికి ద్రోహం చేసింది. ఓ వ్యక్తి దగ్గరినుంచి ఏకంగా పది లక్షల రూపాయలు కొట్టేసింది. చివరకు నేరం రుజువై.. కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆఖరికి ఉద్యోగం కూడా పోగొట్టుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
శివగంగ జిల్లాకు చెందిన ఆశ్రత్ అనే వ్యక్తి 2021లో ఓ వ్యక్తి దగ్గరినుంచి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు ఉన్న బ్యాగుతో తన వాహనంలో వెళుతూ ఉండగా.. ఇన్‌స్పెక్టర్ వాసంతి చెకింగ్ కోసం అతడి వాహనాన్ని ఆపింది. బ్యాగులో డబ్బు ఉండటం చూసింది. ‘ ఆ బ్యాగులో ఉన్న డబ్బు నీదే అని రుజువు కావాలి. డబ్బును స్టేషన్లో ఉంచుతాను. రుజువులతో రేపు వచ్చి తీసుకుపో’’ అని అంది. తర్వాత డబ్బును తనతో పాటు తీసుకుపోయింది. ఆశ్రత్ మరుసటి రోజు రుజువులతో స్టేషన్‌కు వెళ్లాడు. వాసంతి అతడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అందులో ఎలాంటి డబ్బు లేదని, కేవలం న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్నాయని అంది. దీంతో అతడు ఆమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
మధురై జిల్లా క్రైం బ్రాంచ్ ఆమెతో పాటు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసింది. పోలీసులు నీలగిరి జిల్లాలోని కొత్తగిరిలో ఆమెను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 2021లో మద్రాస్ కోర్టు ఆమెకు కండిషన్ బెయిల్ ఇచ్చింది. జులై 2022లో వాసంతి దీనిపై ఓ కోర్టులో ఓ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తర్వాత ఆమె ఆధారాలను చెరపటానికి ప్రయత్నిస్తోందని, సాక్షులను బెదిరిస్తోందని, బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 24, 2023లో దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ రద్దు చేయటానికి తిరస్కరించింది. అయితే, ఆమె చేసిన తప్పుకు ఉన్నతాధికారులు ఆమెను ఉద్యోగం లోంచి తీసేశారు. బాధితులకు భరోసా ఇవ్వటానికే ఆమెను ఉద్యోగం లోంచి తీసేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాసంతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి, డబ్బు కోసం నేరస్తురాలిగా మారిన వాసంతి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
மதுரையில் வழிப்பறி வழக்கு முன்னாள் காவல் ஆய்வாளர் வசந்தி டிஸ்மிஸ் செய்து மதுரை சரக டி.ஐ.ஜி., பொன்னி உத்தரவிட்டுள்ளார். சாட்சிகளை மிரட்டுதல் உள்ளிட்ட பல்வேறு குற்றங்களில் ஈடுபட்டதாக குற்றச்சாட்டு. ( வீடியோ கோப்புக் காட்சி)#madurai | #vasanthi | #Police @SRajaJourno #abpnadu pic.twitter.com/5EE0MlhjQD
— arunchinna (@arunreporter92) April 13, 2023