కొందరు యువతలు పెళ్లి కాకముందు యువకుడితో ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. తీరా ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తుంటారు. అలా ఓ పెళ్లైన మహిళ ప్రేమించిన వాడిని మరిచిపోకుండా ప్రియుడే కావాలంటూ చివరికి అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ ప్రాంతం. అశ్విని యాదవ్ అనే యువకుడు స్థానికంగా ఉండే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి పెద్దలకు నచ్చకపోవడంతో ఇద్దరినీ లిఖితపూర్వకంగా విడగొట్టి ఆ యువతికి మరో వివాహం చేశారు. దీంతో కొన్నాళ్లపాటు యువతి భర్తతో ఉన్న మనసంతా ప్రియుడిపైనే ఉంది. కాగా వారిద్దరు అప్పుడప్పుడు కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుండేవారు.
ఇది కూడా చదవండి: ఆ కోరిక తీర్చలేదని మామపై కోడలి పగ! ప్రియుడితో కలిసి దారుణం!
ఈ విషయం భర్తకు తెలియడంతో ఓసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా భార్య తీరు మారలేదు. దీంతో కోపంతో ఊగిపోయి భర్త ప్రియుడైన అశ్విని యాదవ్ ని దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.