పెళ్లై భర్తా పిల్లలతో ఆనందంగా సాగుతున్న సంసారాల్లో అక్రమసంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అక్రమసంబంధాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇదే రీతిలో ఓ మహిళ తన ప్రియుడ్ని దారుణంగా చంపింది.
సమాజంలో వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. వారి ప్రవర్తనతో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. వరుసకు అక్కాతమ్ముళ్లైన ఓ మహిళ ఓ యువకుడు గత కొంతకాలంగా అక్రమసంబంధం కొనసాగిస్తున్నారు. విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. సమాజంలో పరువుపోతుందంటూ భార్యకు నచ్చజెప్పాడు. భర్త మాటలు విని మారిన ఆమె ప్రియుడ్ని దారుణంగా చంపేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. అసలు ప్రియుడికి ప్రియురాళికి మధ్య ఏం జరిగింది. ఎందుకు ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడాల్సి వచ్చింది? ఆ వివరాలు మీకోసం..
నేటి రోజుల్లో అక్రమసంబంధాలు కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి దారుణాలకు ఒడిగడుతు జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని కాకినాడ జిల్లాలో వరుసకు అక్కాతమ్ముళ్లైన ఇద్దరు అక్రమ సంబందానికి తెరలేపారు. వివరాల్లోకి వెళ్తే.. శకవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన దుర్గా భవానీ, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల వీరిద్దరు పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలో దుర్గా భవానికి రాచపల్లికి చెందిన శ్రీనుతో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా భర్త వేరే ఊరిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. పిల్లలిద్దరు హాస్టల్ లో చదువుతున్నారు. ఈ క్రమంలో దుర్గాభవానీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అయితే పదేళ్ల తరువాత భవాని , ప్రసాద్ మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది.
భర్తలేని సమయంలో ఇంటికి వస్తూ భవానితో ప్రసాద్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భవాని భర్తకు తెలియడంతో ఆమెను మందలించి నచ్చజెప్పాడు. భర్త మాటలు విన్న భవాని ప్రసాద్ ను ఇక తనను కలవకూడదంటూ తెగేసి చెప్పింది. దీంతో ప్రసాద్ భవానిని డబ్బులు అడుగుతూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో విసుగు చెందిన భవాని ఓ రోజు ప్రసాద్ ను ఇంటికి పిలిచింది. తనను వదిలేయాలని నచ్చజెప్పింది. దీనికి ప్రసాద్ ససేమీరా అనడంతో.. భవాని తన చున్నీతో ప్రసాద్ మెడకు గట్టిగా చుట్టడంతో ఊపిరాడక చనిపోయాడు. వీరి మధ్య జరిగిన పెనుగులాటలో ప్రసాద్ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే కింద పడిపోయిన ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రసాద్ చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో ప్రసాద్ మృతికి కారణమైన దుర్గా భవానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.