శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశం దూసుకుపోతుంటే కొంతమంది అమాయక ప్రజలు మాత్రం ఇంకా చేతబడులు, మూడ నమ్మకాలు అంటూ వాటినే నమ్ముతున్నారు. వీటికి అలవాటు పడడమే కాకుండా సొంత వాళ్లను సైతం లెక్కచేయకుండా వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. కానీ ఇటీవల జరిగిన చేతబడి ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగింది కాదు, నగరం నడి బొడ్డున వెలుగు చూసింది. ఓ భర్త భార్యను చంపాలనే చేతబడి చేయించాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తిలోని ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఆ భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డాడు. కానీ అతనికి భార్య అడ్డుగా ఉంది. ఏం చేయాలో అని ఎన్నో రకాలుగా ఆలోచించాడు. అప్పుడే మనోడికి ఓ దుర్మార్గమైన ఆలోచన పుట్టింది. ఎలాగైన నా భార్యను హత్య చేయాలనుకున్నాడు. కానీ నేను చంపితే మర్డర్ కేసు తన మీదకు వస్తుందని కాస్త తెలివిగా ఆలోచించాడు. అప్పుడే వచ్చిన మరో ఆలోచనే భార్యను చేతబడి చేసి చంపడం. ఈ క్రమంలోనే భార్య జ్వరంతో బాధపడుతోంది.
దీనినే ఆసరాగా చేసుకున్న ఆ భర్త ఓ భూత వైద్యుడిని ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం చేతబడి భాగంగా ఓ తెల్ల కోడితో రక్తం చిందించాడు. దీంతో పాటు పుసుపు కుంకుమ, నిమ్మకాయలతో మంత్ర తంత్రాలు చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఆ తంతంగాన్ని పోలీసులు అడ్డుకుని ఆ మహిళ భర్తతో పాటు ఆ భూత వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భార్యను చంపేందుకు చేతబడి చేయించిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.