Divorce: ఏదైనా విజయం సాధించినపుడు దాన్ని సెలెబ్రేట్ చేసుకోవటం చాలా మందికి అలవాటు. అలాంటిది ఏదైనా ఓ గొప్ప విజయం సాధిస్తే.. సెలెబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అందరినీ పిలిచి రచ్చ చేయాలనిపిస్తుంది. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ 18 మంది మగాళ్లు తమ భార్యలతో విడాకుల కేసులో నెగ్గారు. చాలా ఏళ్ల తర్వాత విజయం సాధించటంతో సెలెబ్రేషన్స్‌కు తెరతీశారు. అలాగని, మామూలు సెలెబ్రేషన్స్ కాదు. పెళ్లిని ఎలాగైతే సెలెబ్రేట్ చేస్తామో అలాగన్న మాట. ఇందుకోసం ఏకంగా ఓ ఆహ్వాన పత్రికను కొట్టించారు. సంగీత్‌ను కూడా పెట్టించారు.
పెళ్లి దండను తీసుకుపోయి నీళ్లలో నిమజ్జనం చేయటం. ఏడడుగుల కార్యక్రమం, అగ్ని సాక్షి మంత్రాలు ఇవన్నీ మామూలు పెళ్లిలో జరిగే దానికి వ్యతిరేకంగా జరగనున్నాయి. భోపాల్‌కు చెందిన ఓ ఎన్జీఓ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 18న ఈ వేడుక జరగనుంది. ఆ 18మంది మగాళ్లకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నట్లు నిర్వహకులు తెలిపారు. కొత్త జీవితాలకు స్వాగతం పలుకటానికే ఈ వేడుకని అన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ‘విడాకుల మహోత్సవం’ తాలూకూ ఆహ్వాన పత్రిక సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ మీరు మగజాతి ఆణిముత్యాలు బ్రదర్స్’’.. ‘‘ముందు ముందు ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో..’’.. ‘‘ పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. నూరేళ్ల మంట’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ విడాకుల ఆహ్వాన పత్రికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
OMG – is it for real?
Divorce invitation?Rcvd from WA pic.twitter.com/lJwlyUWuTg
— D Prasanth Nair (@DPrasanthNair) September 10, 2022
ఇవి కూడా చదవండి: పోలీసులనే లాకప్ లో పెట్టిన పోలీసోడు! ఎందుకంటే?..