ఆమె పేరు రచన. వయసు 26 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం జరిగిన నాటి నుంచి భర్తతో సంతోషంగానే జీవించింది. అలా వీరి కాపురం సాఫీగా సాగుతున్న క్రమంలోనే భార్య భర్తకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి తేలుకోని భర్త తలపట్టుకుని చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపన కథనం ప్రకారం.. హైదరాబాద్ సీతాఫల్ మండి ఉప్పర్ బస్తీలో మధులు, రచన అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
చాలా ఏళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. ఇక కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా వీరి దాంపత్య జీవితం బాగానే సాగుతూ వచ్చింది. అయితే భార్య రచన నాగోల్ లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఆపరేటర్ గా పని చేస్తుంది. భర్త కూడా స్థానికంగా పని చేస్తుండడంతో వీళ్లిద్దరు ఎలాంటి గొడవలు లేకుండా కాపురాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రచన సోమవారం ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లింది. సాయంత్రం అయినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త మధులు రచనకు ఫోన్ చేశాడు. కానీ స్విచ్ఛాఫ్ వస్తుంది.
దీంతో ఖంగారుపడ్డ భర్త భార్య పని చేసే ఆఫీసుకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నాడు. అయినా రచన గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ఇక కుటుంబ సభ్యులకు సైతం ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక చేసేదేంలేక భర్త నా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రచన కనిపించకుండా పోవడంతో భర్త పిల్లలతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.