హైదరాబాద్ లో ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. మిత్రుడితో స్నేహం చేస్తూనే అతడి లవర్ పైనే కన్నేశాడు. ఇంతటితో ఆగకుండా ఆ లవర్స్ ఇద్దరు ఏకాంతంగా కలిసున్నప్పుడు సీక్రెట్ కెమెరాతో వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్ సల్మాన్ (23) అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జులాయిగా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.
ఇదిలా ఉంటే అబ్దుల్ సల్మాన్ కు ఓ స్నేహితుడు ఉన్నాడు. అతడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమికులకు అబ్దుల్ సల్మాన్ కాస్త పరిచయం. ఈ పరిచయంతోనే అబ్దుల్ తన స్నేహితుడి ప్రియురాలిపై కన్నేశాడు. ఎలాగైన తన ఫ్రెండ్ లవర్ తో కోరిక తీర్చుకోవాలనుకుని ఓ పథకం వేశాడు. ఇక ఇందు కోసం అబ్దుల్ సల్మాన్ ఓ ప్లాన్ గీశాడు. ఇటీవల అబ్దుల్ సల్మాన్ తన స్నేహితుడిని నమ్మించి మాయ మాటలు చెప్పాడు. నీ ప్రియురాలితో ఏకాంతంగా గడపాలనుకుంటే నీకు ఒక రూమ్ ఏర్పాటు చేస్తాను. అందులోకి రావచ్చు అంటూ నమ్మించాడు. ఇక అబ్దుల్ సల్మాన్ ఇంతటి భరోసా ఇస్తుంటే తన ఫ్రెండ్ మాటను కాదన లేక.. సరే నంటూ ఓకే చెప్పాడు.
దీంతో ఇటీవల ఆ యువకుడు తన ప్రియురాలిని తీసుకుని అబ్దుల్ సల్మాన్ చూపించిన రూమ్ లోకి వెళ్లాడు. అనంతరం ఆ ప్రేమికులు ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. కానీ అంతకు ముందే అబ్దుల్ సల్మాన్ వాళ్లిద్దరున్న రూమ్ లో సీక్రెట్ కెమెరా అమర్చి వెళ్లాడు. ఇక వారు వెళ్లిన తర్వాత ఆ కెమెరాలోని వీడియోలను సేవ్ చేసుకుని తన స్నేహితుడి ప్రియురాలిని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. నా కోరిక తీర్చాలని, లేకుంటే మీ ఇద్దరి వీడియోలు బయటపెడతానంటూ ఆ యువతికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయంతో ఊగిపోయిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు అబ్దుల్ సల్మాన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక విచారణలో అబ్దుల్ సల్మాన్ నేరానికి పాల్పడ్డడని తేలడంతో న్యాయం స్థానం ఈ దుర్మార్గుడికి జైలు శిక్ష విధించింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.