పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న యువకుడి పేరు చంటి కుమార్. ఇటీవల ఓ మహిళ భర్తను చూసుకోవడానికి కేర్ టేకర్ గా చేరాడు. అక్కడే కొన్ని రోజుల పాటు సేవలు అందించాడు. కట్ చేస్తే.. చివరికి అతడు చేసిన పనేంటో తెలుసా?
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భర్త గత కొంత కాలం నుంచి ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో భర్తను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో అతని భార్య ఓ యువకుడిని కేర్ టేకర్ గా రప్పించుకున్నారు. అతడు అక్కడే చాలా కాలంగా ఆమె భర్తకు సేవలు అందిస్తూ నమ్మకంగా ఉన్నాడు. ఇకపోతే ఉన్నట్టుండి కేర్ టేకర్ చేసిన పనికి అతని భార్య ఒక్కసారిగా షాక్ కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేర్ టేకర్ గా చేరి ఆ యువకుడు ఏం చేశాడు. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ కూకట్ పల్లిలోని వివేకానందనగర్ కాలనీలో శైలజ అనే మహిళ తన భర్తతో పాటు కలిసి నివాసం ఉంటుంది. అయితే గత కొంత కాలం నుంచి ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇటీవలే ఆస్పత్రికి వెళ్లి ఇంటికి వచ్చారు. కానీ, అతడిని చూసుకోవడానికి ఓ కేర్ టేకర్ కావాల్సి వచ్చింది. ఇందుకోసం శైలజ భర్తను చూసుకోవడానికి ఓ కేర్ టేకర్ కావాలంటూ బోడుప్పల్ లోని ఓ హోం కేర్ సర్వీసెస్ సంస్థను సంప్రదించారు. దీంతో నిర్వాహకులు శైలజ భర్తను చూసుకోవడానికి గత నెలలో చంటి కుమార్ ( 28) అనే యువకుడిని పంపించారు. అతడు గత కొన్ని రోజులుగా శైలజ భర్తను చూసుకుంటూ నమ్మకంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది.
విషయం ఏంటంటే? ఈ నెల 6న శైలజ ఏదో పని మీద బయటకు వెళ్లింది. ఇదే మంచి సమయం అనుకున్న చంటి కుమార్.. తన ప్లాన్ ను అమలు చేశాడు. శైలజ ఇంట్లో ఉన్న రూ. 7లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో వస్తువులు కనిపించకపోవడం, అప్పటి నుంచి చంటికుమార్ రాకపోవడంతో అతనిపై శైలజకు అనుమానం కలిగింది. దీంతో వెంటనే ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు చంటికుమర్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త చదివిన చాలా మంది.. నమ్మకంగా పని చేస్తూ ఇదేం పని భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో కేర్ టేకర్ గా చేరి దొంగతనానికి పాల్పడిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.