ఇటీవల దేశ వ్యాప్తంగా పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి.. సాంకేతిక లోపాలు.. ఇతర కారణాలు ఏవైనా ఎంతో మంది కార్మికుల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పడు కంటితూడు చర్యలు తీసుకుంటారు.
దేశ వ్యాప్తంగా ఇటీవల పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు భయాందోళకు గురి చేస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యాజామాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల కొన్నికెమికల్ ఫ్యాక్టరీలు మృత్యు కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వాలు భద్రతానియమాలు పాటించాలని చెబుతున్నారు.. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లోని బులందర్ షహర్ లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల మేర వినిపించిందని స్థానికులు అంటున్నారు. సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచరం. పేలుడు తీవ్రతకు చుట్టు పక్కల ఇళల్ కిటికీలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా చిందరవందరగా మారిపోయింది.. ఘటనా స్థలం నుంచి సిలిండర్ల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరణించిన వారు అభిషేక్, రయిస్, అహద్, వినోద్ గా గుర్తించారు.
బులందర్ నగర్.. నగర్ కొత్వాలి ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కెమికల్ ఫ్యాక్టీరీ నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. పేలుడు జరిగిన ఇల్లు కుప్పకూలిపోయింది.. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని బావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో విషాదఛాయలు నిండుకుకున్నాయి. మరోవైపు పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల వారు భయంతో వణికిపోయారు.. ఇలాంటి ఫ్యాక్టరీ నిర్వాహకులు పూర్తి భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
थाना कोतवाली नगर क्षेत्रान्तर्गत खेतों के बीच बने एक मकान में विस्फोट होने के सम्बन्ध में वरिष्ठ पुलिस अधीक्षक की बाइट।@Uppolice @dgpup @adgzonemeerut @igrangemeerut pic.twitter.com/SGhBWxr5ti
— Bulandshahr Police (@bulandshahrpol) March 31, 2023