అది హర్యానా రాష్ట్రం పానిపట్ నగరంలోని మోడల్ టౌన్ ప్రాంతం. ఇక్కడే ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లై 10 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్త స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తుండగా, భార్య బ్యూటీపార్లర్ ను నడిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే శనివారం రాత్రి అందరూ తిని పడుకున్నారు. ఇక తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తల్లితో పాటు పడుకున్న కూతురు జోరు నిద్రలో ఉంది.
ఇంట్లో ఏదో వస్తువులు సదురుతున్న శబ్దాలు కూతురికి వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు మరింత ఎక్కువగా రావడంతో కూతురు తన చేయితో తన పక్కన నిద్రపోయిన తల్లిని తాకే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఆ బాలిక తల్లి కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందని ఆ బాలిక లేచి చూసే సరికి తల్లి ప్రియుడితో పాటు బెడ్ రూంలో కనిపించింది. ఈ సీన్ చూసిన ఆ బాలికకు ఇది కలనా లేక నిజమా అనేది అర్థం కాక కొద్ది సేపు అలాగే ఉండిపోయింది. కూతురు లేవడాన్ని గమనించిన తల్లి మరో గదిలోకి పరుగులు పెట్టింది.
వెంటనే తల్లి ప్రియుడి ఆ బాలిక వద్దకు వచ్చి.., అరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం తల్లి ఇంట్లో ఉన్న బంగారు అభరణాలు, నగదును అంతా తొందర తొందరగా బ్యాగులోకి సర్దేసుకుంది. ఆ తర్వాత తల్లి వెంటనే ఆమె ప్రియుడితో పాటు కారులో ఎక్కి అతనితో పాటు వెళ్లిపోయింది. వారు వెళ్లిన కొద్దిసేపటికి కూతురు ఏడుస్తున్న శబ్దం విన్న తండ్రికి వెంటనే మెలుకువ వచ్చింది. ఏం జరిగిందని కూతురును అడగడంతో కూతురు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. ఉదయాన్నే భర్త నా భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో మాత్రం ఆ మహిళకు స్థానికంగా ఉండే మన్ దీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించారు. ఇక భర్తతో ఉండలేని ఆ మహిళ ప్రియుడితో పాటు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఇటీవల చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భర్తను, 10 ఏళ్ల కూతురుని కాదని ప్రియుడితో పాటు వెళ్లిపోయిన ఈ ఇల్లాలు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.