ఏమైందో ఏమో తెలీదు కానీ, సాయి తన ప్రియురాలి బర్త్‌డే రోజున ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ప్రేమ.. రెండు అక్షరాల ఈ పదం ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటోంది. సిన్సియర్‌గా లవ్ చేసే వాళ్లకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలటం లేదు. నిత్యం ఎన్నో లవ్ ఫెయిల్యూర్స్‌కు సంబంధించిన విషాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. తాజాగా, హన్మకొండలోనూ ఓ సంఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందంటూ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలి బర్త్‌డే నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్‌కు చెందిన సాయి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఏమైందో ఏమో తెలీదు కానీ, సాయి తన ప్రియురాలి బర్త్‌డే రోజున ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకున్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో.. ప్రేమలో తాను దారుణంగా మోసపోయానని పేర్కొన్నాడు. ప్రియురాలు, ఆమె స్నేహితుడు తనను కలిసి మానసికంగా హింసించారని తెలిపాడు. అందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్‌డే రోజునే చనిపోతున్నానని తెలిపాడు. తన ప్రియురాలిపై, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.