ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు లవ్ చేస్తున్నానంటూ అక్కాచెల్లెళ్లను వేధించాడు.
ప్రేమ అంటే ఇద్దరి ఇష్టంతో జరిగే వ్యవహారం. ఒకరినొకరు ఇష్టపడితేనే అది ప్రేమ అవుతుంది. కానీ కొందరు మాత్రం ప్రేమ పేరుతో వేధిస్తుంటారు. ఇష్టం లేదని చెప్పినా మాట వినకుండా వెంటపడుతుంటారు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా యువతులు ఇబ్బంది పడుతుండటాన్ని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా వినకుండా అమ్మాయిలపై దాడులు చేయడం, వేధింపులకు పాల్పడటం లాంటి ఘటనలు ఈమధ్య కాలంలో మరింతగా పెరిగాయి. ఇలాంటి వారి విషయంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ప్రేమ పేరుతో వేధించే కేసుల్లో చాలా మటుకు అమ్మాయిలు మౌనంగా ఉంటున్నారు.
కొందరు మహిళలు మాత్రం తమను వేధించే వారిపై తిరగబడుతున్నారు. అవసరమైతే తమను తాము రక్షించుకోవడానికి ఎదురు దాడులు కూడా చేస్తున్నారు. అలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో ప్రేమ పేరుతో ఇద్దరు అక్కాచెల్లెళ్లను వేధించాడో యువకుడు. వారి వెంటపడుతూ, మెసేజ్‌లు చేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో విసుగెత్తిన యువతి.. ఆ యువకుడ్ని మంగళవారం సమీపంలోని పార్క్‌కు రావాలని పిలిచింది. అక్కడికి వచ్చాక అతడ్ని చెప్పుతో చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు పార్క్‌కు చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శభాష్.. యువకుడికి భలేగా బుద్ధి చెప్పావ్ అంటూ ఆ యువతిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
#Watch | A girl grabs the stalker by collar, beats him with her shoe in #Gwalior park. The accused would repeatedly call her and her sister and #harass them.#harassment #women #stalking pic.twitter.com/rF53RmJRtN
— Free Press Madhya Pradesh (@FreePressMP) April 25, 2023