పేద కుటుంబానికి చెందిన యువతులను ఆకర్షించి క్షుద్ర పూజలు చేయటానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే యువతులు వారి వేధింపులు తాళలేకపోయారు.
ఈ మధ్య కాలంలో అత్యాశతో కొంతమంది చేసే మోసాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అలాంటి నీచులు ఈజీ మనీకి అలవాటు పడి.. ఎలాంటి రకమైన మోసం చేయడానికి కూడా ఆలోచించడం లేదు. ఈ కోవకు చెందిన ఘటనే గుంటూరు లో తాజాగా ఒకటి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన నాగేశ్వరరావు ఉర్లో పూజలు చేస్తూ ఉంటాడు. అలాగే చిలుకూరిపేటకు చెందిన అరవింద అనే మహిళ ఊర్లో చిన్న చిన్న వ్యాపారులు చేస్తూ జీవనం సాగిస్తోంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె వ్యాపారాల్లో బాగా నష్టపోయింది. దీంతో జీవనం సాగించటం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది.
ఆ క్రమంలోనే ఆమె కొన్ని రోజుల నుంచి బతుకుదెరువు కోసం పనిని వెతకడం మెదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఫోన్ ద్వారా అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఇద్దరు కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని మెదుళ్లకు పదును పెట్టారు. దానితోటి ఆ ఇద్దరు కలిసి క్షుద్రపూజలు చేస్తే డబ్బులు బాగా వస్తాయని తెలుసుకున్నారు. అందుకోసం యువతులు కావాలని నిర్ణయించుకున్నారు. యువతులు నగ్నంగా ఆ పూజలో కూర్చోంటే రూ.లక్ష ఇస్తామని ఆ ఊర్లో ఉండే నాగేంద్రకు చెప్పారు. వారి మాటలు విన్న నాగేంద్ర అతని స్నేహితుడు సురేష్‌కు చెప్పాడు. నంద్యాల జిల్లాలో నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులను కలిశాడు.
వారికి డబ్బు ఆశ చూపించి పూజారి నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్ళారు. వారితో పూజలు చేయించారు. ఆ క్రమంలోనే ఆ యువతులపై లైంగిక వేధింపులు కూడా జరిపారు. అంతలోనే వాళ్లు ఎదురుతిరగడంతో శనివారం రోజున ఆ యువతులను బెదిరించి ఓ కారులోకి ఎక్కించి గుంటూరు వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలో యువతులు వాళ్ల ఫోన్ లో ఉండే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నల్లపాడు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పూజారి నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద రాధా(చిలుకూరిపేట) సురేష్ (గుంటూరు) భాస్కర్, పెద్దిరెడ్డి, సాగర్ ఇంకా అనుచరులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతులను క్షుద్ర పూజల పేరుతో వేధించిన ఇలాంటి కామాంధులకు ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.