రూ.100 కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని రాయితో కొట్టి చంపాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కేవలం రూ.100 కోసం తన ప్రాణ స్నేహితుడుని అతి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాలోని డొంకరోడ్డుకు చెందిన రవి, కేవీసీ కాలనీకి చెందిన జాంబీ ఇద్దరూ స్నేహితులు. చాలా కాలం నుంచి కలిసి మెలిసి ఉంటున్నారు. ఇకపోతే గతంలో బాంజీ తన స్నేహితుడైన రవి దగ్గర రూ.100 అప్పు తీసుకున్నాడు.
అప్పటి నుంచి బాజీ పనుల నిమిత్తం నిజామాబాద్ కు వెళ్లాడు. అక్కడే కొన్ని రోజులు పని చేసి ఇటీవల గుంటూరుకు వచ్చాడు. అయితే ఈ నెల 11న బాంజీ అమరావతి రోడ్డులో ఉన్న వైన్ షాప్ కు వచ్చాడు. అదే సమయంలో అక్కడున్న రవి తన మిత్రుడైన బాంజీని చూసి పలకరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలోనే రవి బాంజీకి ఇచ్చిన రూ.100 ఇవ్వాలని కోరాడు. ఇదే విషయంపై ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన జాంబీ.. అక్కడే ఉన్న సిమెంట్ రాయితో రవి తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
స్నేహితుడు చనిపోయాడని తెలుసుకున్న జాంబీ.. భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు జాంబీని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కేవలం రూ.100 కోసం స్నేహితుడిని చంపిన దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.