వారికి పెళ్లై 8 ఏళ్లు అవుతుంది. అప్పటి వరకు వీరు సంతోషంగానే ఉన్నారు. కానీ ఇన్నాళ్లు ఆమె భర్త ఓ నిజాన్ని దాస్తు వచ్చాడు. భర్త ఎన్నోసార్లు చెప్పాలని చూసినా.., వీలు కాలేదు. కాగ ఎట్టకేలకు గుండెను రాయి చేసుకుని భద్రంగా దాచుకున్న నిజాన్ని భర్త ఎట్టకేలకు భార్యకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న భార్యకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. అసలు భర్త చెప్పి ఆ నిజం ఏంటి? ఆ నిజాన్ని భర్త 8 ఏళ్ల పాటు దాచడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ వడదోర ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. అప్పటి వరకు ఈ దంపతుల జీవితం సాఫీగానే సాగుతూ ఉంది. అయితే 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ మహిళ భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడిపిన ఆ మహిళకు మ్యాట్రీమనీ ద్వారా ఢిల్లీలో పని చేస్తున్న విరాజ్ వర్దన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇక ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లైన కొన్నిరోజుల పాటు భర్త భార్యతో శారీరకంగా కలిసిన దాఖలాలు లేవు. ఎన్నోసార్లు ఏదో కారణాలు చూపుతూ భర్త భార్యను అస్సలు తాకనివ్వలేదు.
అలా కొంత కాలానికి భర్త.. నేను రష్యాలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, దాని కారణంగానే శారీరకంగా కలుసుకోలేకపోతున్నానని చెప్పాడు. సర్జరీ జరిగితే తప్పా నేను మాములు స్థితికి రాలేనని చెప్పాడు. భర్త నిజాయితిగా ఒప్పుకోవడంతో పెద్ద మనసు చేసుకుని భార్య భర్తను క్షమించింది. అలా కొన్ని రోజుల తర్వాత భర్త వెయిట్ బాగా పెరిగానని, సర్జరీ చేసుకుంటానని చెప్పి 2020లో కోల్ కతా వెళ్లాడు. ఇక భర్త నిర్ణయాన్ని భార్య స్వాగతించింది. కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేసుకుని భర్త తిరిగి ఇంటికొచ్చాడు. వచ్చిన మరుసటి రోజు నుంచే భర్త భార్యతో శారీరకంగా కలుసుకోవడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య అతను కోల్ కతా నుంచి సర్జరీ చేసుకున్న రిపోర్టులను ఒకసారి పరిశీలించింది.
అసలు నా భర్త మగాడే కాదని తెలుసుకుంది. విజైతా అనే యువతి.., సర్జరీ ద్వారా విరాజ్ గా మారి మగాడిలా నా భర్త నాటకమాడుతున్నాడనే మోసాన్ని తెలుసుకుంది. అసలు విషయం తెలియడంతో ఒక్కసారిగా ఆమె గుండె పగిలినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్లద్దరికీ కౌన్స్ లింగ్ ఇచ్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 ఏళ్ల తర్వాత అసలు విషయం తెలుసుకున్న భార్య ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.