ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలను ముందుగానే పైలెట్లు పసిగట్టడంతో తృటిలో తప్పించుకుంటున్నారు. గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. ఉత్తర గ్రీస్‌లో ఒక కార్గో విమానం కూలిపోయింది. వివరాల్లోకి వెళితే..
సెర్బియా నుంచి జోర్డాన్‌కు వెళ్తున్న సమయంలో ఉత్తర గ్రీస్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుంచి పెద్ద శబ్దాలతో విమానం పడుతున్న దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భారీ విమాన ప్రమాదంలో ఉక్రేయిన్ కి చెందిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. బంగ్లాదేశ్ లో మందుగుండు సామాగ్రి కొనుగోలు చేసి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సెర్బియా రక్షణ మంత్రి నెబోజా స్టెఫెనోవిచ్ వెల్లడించారు.
ఇక ప్రమాదం జరిగే సమయంలో భయంకరమైన శబ్ధాలు రావడం.. ఆ పరిసర ప్రాంతాల్లో తెల్లటి పదార్ధం విస్తరించడంతో స్థానికులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారే భయపడిపోయారు. ఈ శబ్ధాలు దాదాపు రెండు గంటల వరకు కంటిన్యూగా వచ్చినట్లు తెలిపారు. ప్రమాద స్థలానికి వచ్చిన జర్నలిస్టులు, స్థానికులు మాస్క్‌లు ధరించాలని పోలీసులు సూచించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపకదళాలు చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అగ్నిమాపక దళం ప్రధానాధికారి మారియోస్ అపోస్టోలిడిస్ చెప్పారు. నిపుణులు కూడా తెల్లని పదార్థం ఏమిటో గుర్తించే పనిలో ఉన్నారు. విమానం ఫ్లైట్ రికార్డర్‌ను అధికారులు ఇంకా రికవరీ చేయలేదని అన్నారు.
ఇది చదవండి: దారుణం..జీన్స్ ధరించవద్దనందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య!
#BREAKING: A Ukrainian cargo plane has reportedly crashed in Kavala, Greece.
Developing…
pic.twitter.com/zIKKbH22pV— Moshe Schwartz (@YWNReporter) July 16, 2022