తల్లిదండ్రులు అంటే దైవాలతో సమానం. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసి.. జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది అలసిపోతే వారిని దగ్గరకు చేర్చుకుని చూడాల్సిన బాధ్యత పిల్లలదే. చూడకపోగా వారిని చులకనగా చూడడం, తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టడం లాంటివి చేయడం మహా పాపం. IAS నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ తమను కొడుకు, కోడళ్ళు పట్టించుకోవడం లేదని, తిండి కూడా పెట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు.
హర్యానాలోని చర్ఖీ దాద్రి జిల్లాలో బాద్రాలోని పట్టణంలో డబ్భై ఏళ్ళు పైబడిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఒక లేఖ కూడా రాశారు. తమ పిల్లలే తమ చావుకి కారణమని లేఖలో పేర్కొన్నారు. 2021 బ్యాచ్ కి చెందిన హర్యానా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తమను సరిగా చూసుకోవడం లేదని.. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని లేఖలో పేర్కొన్నారు. జగదీష్ చంద్ర (78), ఆయన సతీమణి బాగ్లీ (77) బాద్రాలోని గోపీ గ్రామంలో నివాసం ఉండేవారు. తన కొడుకులకు పట్టణంలో 30 కోట్ల ఆస్తి ఉన్నా తమకు అన్నం పెట్టడానికి నిరాకరించారని లేఖలో వెల్లడించారు.
తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని.. తమపై దౌర్జన్యం చేసిన కొడుకు, కోడళ్ళకు శిక్ష పడినప్పుడే చనిపోయిన మా ఆత్మలకు శాంతి చేకూరుతుందని రాసుకొచ్చారు. అంతేకాదు తన ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు స్థానిక ఆర్య సమాజ్ కు విరాళంగా ఇచ్చినప్పుడే తన ఆత్మకు శాంతి చేకూరుతుందని రాసుకొచ్చారు. సొంత కొడుకుల చేతిలో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాం అని అన్నారు. నీలం, వికాస్, సునీత, వీరేందర్ తమ చావుకు కారణమని వెల్లడించారు. ‘ఈ ప్రపంచంలో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడరు. నా లేఖ చదివే వారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే.. వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే తమ ఆత్మలకు శాంతి చేకూరుతుంది’ అంటూ రాసుకొచ్చారు.
ఈ ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు నలుగురి మీద కేసులు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి తల్లిదండ్రులు, ఇద్దరు ఇతర కుటుంబ సభ్యుల మీద కేసు బుక్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న జగదీశ్ చంద్ కొడుకు వీరేందర్ ఆర్య, ఈయన భార్య సునీత, చనిపోయిన కుమారుడు మహేందర్ భార్య నీలం, ఈమె సహచరుడు, వేద్ ప్రకాష్ కొడుకు వికాస్ లను నిందితులుగా చేర్చినట్లు బాద్రా పోలీసులు వెల్లడించారు. తన చిన్న కొడుకు మహేందర్ తో ఉండేవారిమని.. అయితే ఆరేళ్ళ క్రితమే తమ కుమారుడు చనిపోయాడని లేఖలో రాసుకొచ్చారు.
కొడుకు చనిపోయిన కొన్ని రోజుల వరకూ అన్నం పెట్టిన కోడలు నీలం ఆ తర్వాత వికాస్ తో కలిసి అనైతిక కార్యకలాపాలకు పాల్పడిందని అన్నారు. అభ్యంతరం చెప్పినందుకు తనను ఇంట్లోంచి గెంటేశారని.. రెండేళ్లు వృద్ధాశ్రమంలో ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత తన భార్యకు పక్షవాతం వస్తే చిన్న కోడలు నీలం గెంటివేసిందని.. తన పెద్ద కొడుకు వీరేందర్ ఇంట్లో ఉందామని వెళ్తే పెద్ద కొడుకు, పెద్ద కోడలు కూడా పట్టించుకోలేదని, అన్నం పెట్టేవారు కాదని లేఖలో పేర్కొన్నారు. మృతుల మనవళ్లలో ఒకరు ఐఏఎస్ అధికారి కాగా మరొకరు ఆర్మీలో సైనిక అధికారిగా ఉన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
“मेरे बेटों के पास 30 करोड़ की संपत्ति है, जबकि हमारे पास रोटी नहीं..”
सुसाइड नोट लिख IAS के दादा-दादी ने की खुदकुशी, हरियाणा के चरखी दादरी से सामने आया मामला#Haryana pic.twitter.com/C4dVMCarcr
— News24 (@news24tvchannel) March 31, 2023