ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి అక్రమ దందాలపై పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తునే ఉన్నారు.. కానీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఎంతో గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చకున్న గోవాలో పోలీసులు ఓ వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు. ఈ సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నది హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాగా, అతడిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్ సయ్యద్ బిలాల్ (26) అనే వ్యక్తి కొంత కాలంగా గోవాలో గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
ఇది చదవండి: లాడ్జికి పిలిచి భార్య కాలు నరికిన భర్త.. కారణం ఏంటంటే?
ఇందుకోసం పెద్ద పెద్ద నగరాలకు చెందిన యువతులను తీసుకు వచ్చేవాడు. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో వ్యభిచార రాకెట్ కార్యకలాపాలపై సమాచారం సేకరించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా, వ్యభిచార కూపంలో ఉన్న ముగ్గురు మహిళలను కాపాడారు. వారిలో ఒకరిని ముంబయికి చెందిన టీవీ నటిగా గుర్తించారు. సంగోల్డా గ్రామంలో ఓ హోటల్ కు అమ్మాయిని పంపిస్తే రూ.50 వేలు ఇస్తామని అతడితో ఒప్పందం కుదుర్చుకుని, సరైన ఆధారాలతో అతడిని పట్టుకున్నారు. తాము కాపాడిన మహిళల వయసు 30 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారిలో ఇద్దరు ముంబయి విరార్ ప్రాంతానికి చెందినవారని, మరో మహిళ హైదరాబాద్ వాసి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.