Crime News: ఉప్మా విషయంలో తలెత్తిన గొడవ ఓ విద్యార్ధి ప్రాణాల మీదకు తెచ్చింది. గొడవ కారణంగా విచక్షణ మరిచిపోయిన ఓ విద్యార్థి మరో విద్యార్థి గొంతు కోశాడు. ఈ సంఘటన హైదరాబాద్, గచ్చిబౌలిలోని గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గచ్చిబౌలిలోని ఓ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య ఉప్మా విషయంలో గొడవ చోటుచేసుకుంది. రాత్రి సమయంలో విద్యార్థులు అందరూ ఉప్మా తింటున్నారు. ఈ సమయంలో ఓ విద్యార్థి చెయ్యిపై మరో విద్యార్థి ప్లేటులోంచి ఉప్మా పడింది. దీంతో ఆ ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఉపాధ్యాయులు కలుగజేసుకుని వారికి సర్థిచెప్పి అక్కడినుంచి పంపేశారు.
అయితే, గొడవను మర్చిపోలేని ఓ విద్యార్థి అర్థరాత్రి పూట మరో విద్యార్థి గదిలోకి వెళ్లాడు. కత్తితో అతడి గొంతు కోశాడు. గొంతు తెగింది.. నొప్పితో బాధితుడు అరవసాగాడు. అతడి అరుపులు విన్న తోటి విద్యార్థులు అక్కడికి వచ్చి చూశారు. వెంటనే ఈ విషయాన్ని హాస్టల్ నిర్వహకులకు చెప్పారు. వారు అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అతడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి వారిని ఆరాతీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad Crime: తాళిబొట్టు తెంచి, తీవ్రంగా కొట్టిన భర్త.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.