మద్యానికి బానిసై ఎవరేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సమాజంలో తాగుడుకు ఎంతో బానిసై వారీ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తాగుడు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తోందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాగుడుకు డబ్బులు లేక కొందరు ఇంట్లోని విలువైన సామాన్లు అమ్ముకోవటం చూశాం. కానీ మద్యానికి బానిసై ఏకంగా కన్నబిడ్డను అది కూడా నెలన్నర ముక్కుపచ్చలారని కొడకుని అమ్ముకునేందుకు ప్రయత్నం చేశాడో కీరాతక తండ్రి.
ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే అడ్డుకునేందుకైనా, తన బాధను నలుగురితో చెప్పటానికైన తన భార్య ముగదవ్వటం విశేషం. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామం చెంచుగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బయ్యన్న అనే వ్యక్తి మద్యానికి బానిసై ప్రతీ రోజు తాగుతూ తాగుబోతుగా తయారయ్యాడు. ఇక మద్యానికి డబ్బుల్లేక మధ్యవర్తుల సాయంతో నెలన్నర వయసున్న కొడుకును అమ్మేశాడు.
ఇక మొత్తానికి ముందుగానే రెండు లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. విషయం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఇక బేరం కుదుర్చుకున్నట్లుగానే ముందుగా రూ.1,50,000 అడ్వాన్సుగా తీసుకున్నాడు. దీంతో బాలుడిని అప్పగించేందుకు వెళ్తుండగా సీన్ రివర్స్ తిరిగింది. ఏంటంటే వెళ్తున్న సమయంలో పోలీసులకు కొందరు వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో వెళ్లిన పోలీసులకు చిక్కాడు ఈ బానిస తండ్రి. ఇక వెంటనే వారి ఇంటికి చేరుకుని భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఇక స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది.