ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు. సెలబ్రెటీల పిల్లలు, సినీ తారాలు డ్రగ్స్ కేసులతో సతమతమవుతుండగా తాజాగా హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో దాదాపు రూ.2 కోట్ల విలువైన 4.92 కేజీల మెపిడ్రెన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. డ్రగ్స్ తరలిస్తున్న కారు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సీజ్ చేశారు.
మొదట కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తి వద్ద 4 గ్రాముల మత్తుపదార్థం దొరికింది. అతన్ని పోలీసుల విచారించగా మేడ్చల్ కన్నా మహేశ్వరరెడ్డి వద్ద 926 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్వర్‌రెడ్డిని విచారించగా నాగర్‌కర్నూల్‌లో రామక్రిష్ణగౌడ్ అనే వ్యక్తి కారులో 4.92 కేజీల డ్రగ్స్ దొరికాయి. కాగా ఈ మత్తుపదార్థాన్ని కాలేజీ విద్యార్థులకు విక్రయించేందుకు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.