Crime News: వైద్య వృత్తికే కలంకం తెచ్చే పని చేశాడు ఓ డాక్టర్. కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ రెండు కిడ్నీలను తీసేశాడు. ప్రస్తుతం ఆ మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమీట్టాడుతోంది. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, ముజఫర్‌పూర్‌లోని మధురాపూర్‌కు చెందిన సునీత అనే మహిళకు కొద్దిరోజుల క్రితం కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె సుభ్‌కాంత్ క్లీనిక్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. గర్భసంచిలో గడ్డ ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో సునీత భర్త రామ్ సెప్టెంబర్ 3న తన భార్యకు ఆపరేషన్ చేయించాడు.
ఆపరేషన్ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. శరీరం మొత్తం ఉబ్బటం మొదలైంది. దీంతో ఆమెను పాట్నాకు తీసుకెళ్లిపోవాలని సుభ్‌కాంత్ క్లీనిక్ వైద్యుడు పవన్ కుమార్ తెలిపారు. పవన్ తనే స్వయంగా ఆమెను తన కారులో తీసుకుని పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడ 24 గంటల పాటు ఉంచిన తర్వాత ఆమెను అక్కడినుంచి పంపేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది.
డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ ఆర్కే సింగ్, ఆసుపత్రి సిబ్బంది జితేంద్ర పాశ్వాన్‌తో పాటు డాక్టర్ పవన్ భార్య కలిసి తన కూతురి రెండు కిడ్నీలు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : శ్రీకన్యకు అది చేయలనే కోరిక బలంగా ఉంది.. ఎవరూ లేని టైమ్ లో డాబా పైకి వెళ్లి!